ఫ్లాప్ అని ఒప్పుకున్న యంగ్ హీరో!

Published : May 30, 2019, 04:59 PM IST
ఫ్లాప్ అని ఒప్పుకున్న యంగ్ హీరో!

సారాంశం

మెగాఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. 

మెగాఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. మొదటినుండి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోన్న ఈ హీరో సరికొత్త కథలను ఎన్నుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈరోజు అల్లు శిరీష్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. తనకు విషెస్ చెప్పిన అందరికీ థాంక్స్ చెబుతూ ఈ హీరో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇటీవల ఏబీసీడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు శిరీష్. 

మలయాళ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ విషయాన్ని అల్లు శిరీష్ స్వయంగా అంగీకరించాడు. మంచి సినిమా అందించడానికి ఎంతో కష్టపడ్డామని.. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని చెప్పారు. తనకు సపోర్ట్ చేసిన దర్శకనిర్మాతలకు, ఆడియన్స్ కి థాంక్స్ చెబుతూ హుందాగా ప్రవర్తించాడు. 

 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..