బిజెపి కూడా ఫెయిల్.. రాజకీయాలకు స్టార్ హీరో నో!

By Siva KodatiFirst Published May 30, 2019, 5:36 PM IST
Highlights

తలా అజిత్ అంటే తమిళనాడులో ఆయన అభిమానులు ఊగిపోతారు. వరుస విజయాలకు తోడు అజిత్ తన వ్యక్తిత్వంతో విశేషంగా అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నాడు. అజిత్ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. తన ఫ్యామిలీ, సినిమాలు అన్నట్లుగా అజిత్ ఉంటాడు.

తలా అజిత్ అంటే తమిళనాడులో ఆయన అభిమానులు ఊగిపోతారు. వరుస విజయాలకు తోడు అజిత్ తన వ్యక్తిత్వంతో విశేషంగా అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నాడు. అజిత్ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. తన ఫ్యామిలీ, సినిమాలు అన్నట్లుగా అజిత్ ఉంటాడు. పలు సంధర్భాల్లో అజిత్ కేంద్రంగా రాజకీయ చర్చ జరిగింది. అమ్మ వారసుడు అంటూ జయలలిత మరణించిన సమయంలో ప్రచారం జరిగింది. 

అజిత్, జయలలిత మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో జయ వారసుడిగా అజిత్ అన్నా డీఎంకే పగ్గాలు చేపట్టాలని అప్పట్లో కొందరు అభిమానులు డిమాండ్ చేశారు. కానీ ఆ వాదనని అజిత్ తోసిపుచ్చాడు. ఇటీవల కూడా అజిత్ ని రాజకీయాల్లోకి లాంగేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తమిళనాడులో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో స్టార్ క్యాంపైనర్ లేక తమిళనాడు బిజెపి సతమతమవుతోంది. దీనితో అజిత్ ని పార్టీలోకి ఆహ్వానించాలని బిజెపి నేతలు ప్రయత్నాలు జరిపారాట. కానీ వారి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 

తనకు ఏమాత్రం రాజకీయాలపై ఆసక్తి లేదని తేల్చి చెప్పేశాడు. తన చిత్రాల్లో కూడా రాజకీయాల ప్రస్తావన ఉండకూడదని అజిత్ భావిస్తున్నాడట. హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 60వ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం వినోద్ రెండు కథలతో అజిత్ వద్దకు వెళ్ళాడట. అందులో ఒకటి రాజకీయ నేపథ్యం ఉన్న కథ. మరొకటి సామజిక సమస్యలపై పోరాడే పోలీస్ కథ. అజిత్ పొలిటికల్ కథని రిజెక్ట్ చేసి పోలీస్ ఆఫీసర్ కథకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. 

 

click me!