ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

By Prashanth MFirst Published Oct 14, 2018, 11:52 AM IST
Highlights

రామ్ గోపాల్ వర్మ ఎక్కువ కాలం సైలెంట్ గా ఉంటే అది ఒక వివాదానికి సూచిక అనే విషయం ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ అటకెక్కిందని అంతా అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా కొన్ని పోటోలను పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు. 

రామ్ గోపాల్ వర్మ ఎక్కువ కాలం సైలెంట్ గా ఉంటే అది ఒక వివాదానికి సూచిక అనే విషయం ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ అటకెక్కిందని అంతా అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా కొన్ని పోటోలను పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు. ఇక చంద్రబాబు లా కనిపిస్తున్న ఒక వ్యక్తి వీడియో పోస్ట్ చేసి మరో షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబుకు సంబందించిన పాత్రను ప్రధానంగా చూపించనున్నాడట వర్మ. అయితే అతని పాత్ర కోసం గత కొంత సెర్చ్ చేస్తుండగా ఈ వీడియో దొరికిందని వర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇక అందులో ఉన్న వ్యక్తిని ఎట్టకేలకు వర్మ కనుగొన్నాడు. రోహిత్ అనే వ్యక్తి తనకు తెలిపినట్లు వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

ముందుగా చెప్పినట్టుగానే అతన్ని పట్టిస్తే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పిన వర్మ రోహిత్ ఎకౌంట్ కి డబ్బులు పంపిస్తానని చెప్పాడు. మొత్తానికి వర్మ తాను అనుకున్న వ్యక్తిని కనుగొన్నాడు ఇకపోతే ఆ వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెట్టాలని నెటిజన్స్ వర్మను ప్రశ్నిస్తున్నారు. వర్మ 19వ తేదీ నాడు సినిమా గురించి ఫుల్ క్లారిటీ ఇస్తానని చెప్పాడు. మరి అప్పుడు చంద్రబాబు లా కనిపిస్తున్న ఆ వ్యక్తిని చూపిస్తాడో లేదో చూడాలి. 

click me!