చంద్రబాబు భయపడ్డారంటూ వర్మ వీడియో కౌంటర్!

By Udaya DFirst Published Feb 21, 2019, 11:39 AM IST
Highlights

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ కోసం రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు.  

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ కోసం రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు.  లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి జరిగిన వాస్తవ ఘటనలకు చిత్రరూపమంటూ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలకు సిద్ధమవుతున్న వేళ, సినిమా ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉన్న వర్మ, తనకు దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. 

ఈ ఉదయం చంద్రబాబునాయుడు, తన టెలీ కాన్ఫరెన్స్ లో సినిమాను ప్రస్తావిస్తూ, ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే స్పందించిన వర్మ, ఓ వీడియో టీజర్ తో కౌంటర్ ఇచ్చారు. 

'మహానాయకుడు' చిత్రంలోని రానా (చంద్రబాబు పాత్రధారి) కనిపించే వీడియోను పోస్ట్ చేస్తూ, "లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మీద వచ్చే రకరకాల రియాక్షన్స్‌కు మీ నుండి వచ్చే రియాక్షన్‌ ఏంటి సార్‌?" అని జర్నలిస్ట్ ప్రశ్నించినట్టుగా, "దానికి సమాధానంగా మీరేమన్నా సరే రియాక్ట్ కావొద్దు, ఏమన్నా సరే" అంటున్న రానాను చూపించారు. ఈ వీడియో బిట్ 'మహానాయకుడు' థియేటరికల్ ట్రయిలర్ లోనిదే కావడం చెప్పుకోదగ్గ విషయం. ఇక దీనికి క్యాప్షన్ గా "లక్ష్మీస్ ఎన్టీఆర్ పై చంద్రబాబు భయం ఇలా ఉంది" అని రాశారు. 

CBN’s scared reaction on pic.twitter.com/6gQOjmCE5Z

— Ram Gopal Varma (@RGVzoomin)
click me!