ఆర్ధిక ఇబ్బందుల్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్!

Published : Feb 21, 2019, 10:55 AM IST
ఆర్ధిక ఇబ్బందుల్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్!

సారాంశం

'యువకుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి భూమికకి 'ఖుషి' సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తరువాత ఆమెకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి.

'యువకుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి భూమికకి 'ఖుషి' సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తరువాత ఆమెకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. ఒక్కడు, సింహాద్రి ఇలా హిట్ల మీద హిట్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. 

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2007లో భరత్ ఠాకూర్ ని వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న తరువాత కూడా సినిమాల్లో కంటిన్యూ చేసింది. మధ్య కొంత కాలం గ్యాప్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు ఆమె నటిగా బిజీ అవ్వాలని ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలో టాలీవుడ్, కోలివుడ్ లలో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. తిరిగి నటిగా బిజీ అవ్వాలనుకోవడానికి కారణం ఆమెకి ఉన్న ఆర్ధిక ఇబ్బందులే అని సమాచారం.

భూమిక భర్త భరత్ కి వ్యాపారాల్లో తీవ్ర నష్టాలు రావడంతో భర్తకి తోడుగా ఉండడం కోసం మళ్లీ సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటాలని చూస్తోంది. మరి ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు వస్తాయో లేదో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?