ప్రముఖ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్య కన్నుమూత!

Published : Feb 21, 2019, 11:06 AM ISTUpdated : Feb 21, 2019, 11:14 AM IST
ప్రముఖ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్య కన్నుమూత!

సారాంశం

ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్యకన్నుమూశారు. ముంబైలోని హెచ్.ఎన్.రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ లో ఈరోజు ఉదయం ఆయన మరణించారు. 

ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్య కన్నుమూశారు. ముంబైలోని హెచ్.ఎన్.రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ లో ఈరోజు ఉదయం ఆయన మరణించారు. 
ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కొద్దిరోజుల క్రితమే ప్రభాదేవి ఆఫీస్ లో రాజ్ కుమార్ గారిని కలిసినట్లు అప్పుడు బాగానే ఉన్న ఆయన సడెన్ గా చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. రాజశ్రీ ప్రొడక్షన్స్ పై పలు రాజ్ కుమార్ పలు చిత్రాలను నిర్మించారు. మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్ చిత్రాలు నిర్మాతగా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చాయి. 

హమ్ ఆప్ కే హై కౌన్ చిత్రానికి గాను ఆయన ఫిలిం ఫేర్ అవార్డు ని అందుకున్నారు. తన కెరీర్ లో 'వివాహ్', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'హమ్ సాత్ సాత్ హై' వంటి చిత్రాలను నిర్మించారు. 

ఆయన ప్రొడక్షన్ లో వచ్చిన ఆఖరి చిత్రం 'హమ్ చార్' ఫిబ్రవరి 15, 2019 లో విడుదలైంది. రాజ్ కుమార్ తన భార్య సుధా బర్జాత్య, కొడుకు సూరజ్ బర్జాత్యలతో కలిసి  జీవించేవారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar OTT విడుదల తేదీ ఖరారు.. బాహుబలి రేంజ్ సినిమా ఎక్కడ చూడాలో తెలుసా ?
O Romeo Trailer: ప్రభాస్ హీరోయిన్ నెక్స్ట్ మూవీ ఇదే, ట్రైలర్ అదిరిందిగా