మెట్రో రైలు గుట్టు విప్పిన రేవంత్

First Published Mar 29, 2018, 6:04 PM IST
Highlights
శంషాబాద్ వరకు పొడిగించడానికి కారణమదే?

తెలంగాణ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి  మరోసారి విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో మెట్రో రూట్ పై అభ్యంతరాలు చెప్పిన కేసీఆర్ సీఎం కాగానే అదే మార్గాల్లో నిర్మాణానికి అనుమతులెలా ఇస్తాడని ప్రశ్నించారు. చారిత్రక కట్టడాలైన అసెంబ్లీ,అమరవీరుల స్తూపం,సుల్తాన్ బజార్,ఓల్డ్ సిటీ ,పురాతన కట్టడాల ప్రాంతాల్లో ఆపడానికి ప్రయత్నించిన కేసీఆర్ అధికారంలోకి రాగానే అన్నీ పక్కనపెట్టి  రామేశ్వర్ రావు ఆస్తులను పెంచే నిర్ణయాలు తీసుకుంటున్నాడని మండిపడ్డారు. ఇంతకు ముందు నిర్ణయించిన ఫలక్ నామ నుండి శంపాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గాన్ని కాదని రాయదుర్గం నుండి ఎయిర్ పోర్ట్ వరకు అని కొత్త ప్రతిపాదన తీసుకు వచ్చాడని ఇదంతా రామేశ్వర్రావు ఆస్తులను పెంచే కార్యక్రమంలో భాగమేనని రేవంత్ రెడ్డి అన్నారు.


ఇంకా రేవంత్ మెట్రో ప్రాజెక్టుకు, కేసీఆర్ కు ఉన్న లింకులను బైటపెట్టాడు. మొత్తం రూ.1200 కోట్ల విలువైన వాటాలను  ఎల్&టి కంపెనీ నుండి కేసీఆర్ కుటుంబానికి చెందిన బినామీ కంపెనీలు కేవలం రూ. 215 కోట్లకే కొనుగోలు చేశారని ఆరోపించారు.ఓల్డ్ సిటీ ప్రజల సౌకర్యం కోసం మొదలు పెట్టాలనుకుంటున్న మెట్రో రైల్ నిర్మాణాన్ని అడ్డుకొని ,కేసీఆర్ తన బంధువులకు లాభం చేకూర్చే విధంగా మరో రూట్ ముందుకు తీసుకువచ్చారని తెలిపారు. ఈ మెట్రో అవినీతి బాగోతంపై విచారణ కమిటీ ద్వారా విచారణ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు.  అందుకే సీఎం కేసీఆర్ మీదా  ఆయన కుటుంబం మీద ఆరోపణలు చేస్తున్నట్లు రేవంత్ తెలిపారు.


 

click me!