ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

Published : Mar 29, 2018, 05:22 PM IST
ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

సారాంశం

హైదరాబాద్ శివారు ప్రాంతంలో దారుణం

ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. చిన్నారి అరుపులతో అప్రమత్తమైన తల్లిదండ్రులు చిన్నారిపై అఘాయిత్యం జరక్కుండా ఆపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.   

హైదరాబాద్ శివారుప్రాంతమైన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని జలాల్‌బాబానగర్‌లో అజీజ్(48) నివసిస్తున్నాడు. అయితే అదూ కాలనీలో ఇతడి ఇంటి సమీపంలె ఓ కుటుంబం నివసిస్తోంది. ఈ కుటుంబంలోని ఓ ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇతడి కన్ను పడింది. ఆ పాపను తన ఇంట్లోకి పిలుచుకుని అత్యాచారయత్నం చేయబోగా.. బాలిక కేకలు వేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో బాలిక కేకలు విన్న అమ్మాయి తల్లిదండ్రులు, స్థానికులు అజీజ్‌ను రెడ్ హాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులను అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?