షూటింగ్ సెట్స్ లో షారుక్ ఖాన్ కి ప్రమాదం, సర్జరీ చేయాలన్న డాక్టర్స్!

Published : Jul 04, 2023, 01:04 PM ISTUpdated : Jul 04, 2023, 01:15 PM IST
షూటింగ్ సెట్స్ లో షారుక్ ఖాన్ కి ప్రమాదం, సర్జరీ చేయాలన్న డాక్టర్స్!

సారాంశం

హీరో షారుక్ ఖాన్ ప్రమాదానికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాస్ ఏంజెల్స్ లో ప్రమాదం చోటు చేసుకోగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారట.   

నేషనల్ మీడియా కథనం ప్రకారం షారుక్ ఖాన్ తన అప్ కమింగ్ మూవీ చిత్రీకరణ కోసం లాస్ ఏంజెల్స్ వెళ్లారు. చిత్రీకరణ సమయంలో ఆయనకు ప్రమాదం జరిగింది. ముక్కుకి తీవ్ర గాయమైంది. వెంటనే సిబ్బంది దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రమాదం ఏమీ లేదు, మైనర్ సర్జరీ చేయాలని సూచించారట. సర్జరీ అనంతరం షారుక్ డిశ్చార్జ్ అయ్యారు. 

ప్రస్తుతం షారుక్ ఖాన్ ఇండియాలో ఉన్నారు. ఆయన మెల్లగా కోలుకుంటున్నారు. గాయం చిన్నది కావడంతో త్వరగా సాధారణ స్థితికి వచ్చే సూచనలు కలవు. ఈ ప్రమాదంపై షారుక్ ఖాన్ టీమ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. షారుక్ కి ప్రమాదం జరిగిందన్న మేటర్ లీక్ కావంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్షేమం అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. కాగా షారుక్ ఏళ్ల తరబడి విజయం కోసం తపించారు. వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ షారుక్ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నారు. 

ఆయన కమ్ బ్యాక్ మూవీ పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పఠాన్ షారుక్ కి మెమరబుల్ హిట్ ఇచ్చింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. పఠాన్ మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో జవాన్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం పై భారీ హైప్ నెలకొంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. జవాన్ చిత్రంలో ప్రియమణి ఓ కీలక రోల్ చేస్తున్నారు. రెండు వందలకు పైగా బడ్జెట్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా జవాన్ తెరకెక్కుతుంది. 

PREV
click me!

Recommended Stories

2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం