‘బింబిసార 2’కి వంద కోట్ల ఆఫ‌ర్, డీల్ ఏంటంటే

Published : Jul 04, 2023, 12:25 PM IST
 ‘బింబిసార 2’కి వంద కోట్ల ఆఫ‌ర్, డీల్ ఏంటంటే

సారాంశం

బింబిసార రిలీజ్ సమయంలోనే ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుంది, ఒక ఫ్రాంచైజ్ లా సినిమాలు వస్తూ ఉంటాయి అని కళ్యాణ్ రామ్ కన్ఫామ్ చేసి చెప్పేసాడు. 

కేవలం క‌ల్యాణ్ రామ్ కెరీర్‌కి మాత్రమే కాకుండా థియేటర్స్ కు జనం రావటం లేదనే టైమ్ వచ్చినప్పుడు అది తప్పని చూపి  బూస్ట‌ప్ ఇచ్చిన సినిమా బింబిసార‌. కొత్త దర్సకుడు వశిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఊహించని విజ‌యాన్ని అందుకొంది. మాస్ లో బింబిసార సినిమాకి మరింత రీచ్ దక్కింది. ఫాంటసీ డ్రామాగా, 40 కోట్ల బడ్జెట్‌తో కొత్త దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేసిన బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

బింబిసార రిలీజ్ సమయంలోనే ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుంది, ఒక ఫ్రాంచైజ్ లా సినిమాలు వస్తూ ఉంటాయి అని కళ్యాణ్ రామ్ కన్ఫామ్ చేసి చెప్పేసాడు. బింబిసార 2లో లేదా 3లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తాడని కళ్యాణ్ రామ్ చెప్పాడు. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ తన సినిమాలతో బిజీ అయిపోయాడు కానీ బింబిసార 2 గురించి అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్  లేదు. కానీ లేటెస్ట్ గా బింబిసార 2 సినిమా గురించి ఒక వార్త  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే..

జీ 5 వారు  వంద కోట్ల ఆఫర్‌తో ఈ సినిమా కొన‌డానికి ముందుకు వ‌చ్చినట్లు తెలుస్తోంది. డీల్  ఏమిటంటే... జీ 5 రూ.100 కోట్లు ఇస్తుంది. క‌ల్యాణ్ రామ్.. ఫ‌స్ట్ కాపీ ఇవ్వాలి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. మొదటి పార్ట్ ని సూపర్బ్ గా డైరెక్ట్ చేసిన వశిష్ఠ, పార్ట్ 2 నుంచి తప్పుకున్నాడు. ఆ స్థానంలో రొమాంటిక్ ద‌ర్శ‌కుడు అనిల్ వ‌చ్చి చేరారని తెలుస్తోంది. దర్శకుడు వ‌శిష్ట తప్పుకున్నా.. జీ 5 ఆఫ‌ర్ లో మాత్రం మార్పు లేదు. అయితే క‌థ ఇంకా రెడీ కాలేదు. 

వ‌శిష్ట బింబిసార 1 టైమ్ లోనే 2 కి సంబంధించిన క‌థ రాసేశాడు. కానీ ఆ క‌థ‌ని ప‌క్క‌న పెట్టి, పూర్తిగా కొత్త క‌థ రాసుకొనే ప్ర‌య‌త్నాల్లో ఉంది చిత్ర బృందం. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆల‌స్యం అవుతోంది. ఆగ‌స్టులో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. 2024 వేస‌విలో ప్రేక్షకుల ముందుకు రావొచ్చు. బింబిసార చిత్రంలో కళ్యాణ్ రామ్ పాత్ర ముగిసిపోతుంది. చనిపోయినట్లు చూపించారు. కానీ సినిమాకు కొనసాగింపు ఉంటుంద‌నే ఉద్దేశంతో అంత‌కు ముందే సంజీవిని మొక్క‌తో బ‌తికిస్తార‌నే ఓ పాయింట్‌ను చూపిస్తారు. సెకండ్ పార్ట్‌లో సంజీవిని మొక్క‌తో క‌ళ్యాణ్ రామ్‌ను బ‌తికిస్తార‌నే విష‌యంపై ఓ క్లారిటీ ఇచ్చేసిన‌ట్లు అయ్యింది.
 
ఈ సినిమాను మొదట ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ బడ్జెట్‌తో నిర్మించాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు జీ5 ఈ ప్రాజెక్టు టేకప్ చేయాల్సి ఉంటుంది. వశిష్ట కథకి మాత్రమే పరిమితం అయ్యి దర్శకత్వ బాధ్యతలు మాత్రం ఇంకొకరి చేతికి అప్పగించినున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాపై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి

PREV
click me!

Recommended Stories

2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం