నన్ను చూసి మమ్మీ నువ్వు చచ్చిపోవద్దు అంటూ నా కూతురు ఏడ్చింది

Published : Oct 15, 2017, 06:51 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
నన్ను చూసి మమ్మీ నువ్వు చచ్చిపోవద్దు అంటూ నా కూతురు ఏడ్చింది

సారాంశం

నీతోనే డాన్స్ షోతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రేణు దేశాయి షోలో తన అనుభవాలను పంచుకుంటున్న పవన్ మాజీ భార్య రేణు దేశాయి మెడిసిన్ తీసుకుని తాను నిద్రపోతే అమ్మా చచ్చిపోకంటూ కూతురు ఏడ్చిందన్న రేణు

పవన్‌ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ చాలా కాలం తర్వాత... ప్రేక్షకుల ముందుకు నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌తో వచ్చిన విషయం తెలిసిందే. పవన్ నుంచి విడిపోయిన తర్వాత జరిగిన ఒక్కో సంఘటనను ఆమె అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తను చెప్పిన ఓ సంఘటన మాత్రం ప్రతి ఒక్కరికి కళ్లు చెమర్చేలా చేసింది.

 

కొంతకాలం క్రితం తాను తీవ్రమైన జ్వరం, 'ఆర్థో ఇమ్యూన్ కండిషన్' బారిన పడినప్పుడు కోలుకోవడానికి చాలాకాలం పట్టిందని, అదే సమయంలో గుండెలో సమస్యతో, ఇంటికీ, ఆసుపత్రికీ తిరుగుతూ ఇబ్బందులు పడిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ ఘటన గురించి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


చికిత్సలో భాగంగా మాత్రలు వేసుకోవడంతో గాఢ నిద్రలోకి వెళ్లానని, స్కూలు నుంచి వచ్చిన తన కుమార్తె ఆద్య లేపేందుకు ప్రయత్నించి, విఫలమై, అమ్మ చనిపోతుందేమోనన్న ఆందోళనతో ఏడ్చేసిందని రేణూ పేర్కొన్నారు. తనకు మెలకువ వచ్చే సరికి ‘ప్లీజ్‌ మమ్మీ, నువ్వు చచ్చిపోవద్దు ప్లీజ్‌' అని ఒకటే ఏడుపు లంకించుకుందట.

 

దీంతో తాను కూడా ఏడిస్తే కూతురు భయపడుతుందని భావించి, బాధను దాచుకుంటూ, "నేను చనిపోనులే నీతోనే ఉంటాను. ప్రామిస్. అసలు నేను చనిపోతానని ఎందుకు అనుకుంటున్నావు? నేను చనిపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు? నీ పిల్లలను ఎవరు చూస్తారు?" అని చెప్పి ఓదార్చిందట. అమ్మను త్వరగా తీసుకు వెళ్లవద్దని దేవుడిని ప్రార్థించమని చెబితే, దేవుడి ముందు పాప ఎంత సేపు కూర్చుందో కూడా తనకు తెలియలేదని రేణూ చెప్పింది.

PREV
click me!

Recommended Stories

Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు