
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య..మాజీ హీరోయిన్ రేణు దేశాయ్(Renu Desai) తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలం అయ్యింది. చాలా ఏళ్లతరువాత తెలుగు సినిమాలో ఆమె కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
హీరోయిన్ గా చాలా సినిమాల్లో మెరిసింది పవర్ స్టార్(Pawan Kalyan). మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai). పవన్ తో పెళ్లి.. విడాకులు.. పిల్లలు.. ఇలా రకరకాల కారణాల వల్ల.. వెండితెరకు దూరం అయ్యారు రేణు. ఈ మధ్య సోషల్ మీడియాతో పాటు.. చిన్న చిన్న ఆర్ట్ ఫిల్మ్ చేస్తూ..మళ్ళీ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నంచేశారు. ఇక ఇప్పుడు మరోసారి రేణు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ తో రేణు దేశాయ్ కనిపించబోతున్నట్టు సమాచారం.
అటు మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) కూడా వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. రీసెంట్ గా పాన్ ఇండియాను టార్గెట్ చేసుకుని రవితేజ(Ravi Teja) దూసుకుపోతున్నాడు. రవితేజ సినిమల్లో చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరావు.స్టువర్ట్ పురం గజదొంగ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో రేణు దేశాయ్(Renu Desai) ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో రవితేజ సోదరిగా రేణు కనిపించబోతున్నట్టు సమాచారం.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంశీ కృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేస్తున్న ఈ బయోపిక్ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. పాన్ ఇండియాలెవల్లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో టైగర్ నాగేశ్వరావు మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ క్యారెర్టర్ చేయాలంటూ మూవీ టీమ్ రేణు(Renu Desai)తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. త్వరలో ఈవిషయంపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఇక తెలుగులో రేణు దేశాయ్(Renu Desai) జానీ మూవీలో చివరిగా నటించారు. ఈ మూవీ కన్ ఫార్మ్ అయితే ఆమె టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్టే. వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్న రవితేజ(Ravi Teja).. ప్రస్తుతం కంప్లీట్ చేసిన ఖిలాడి సినిమాతో పిబ్రవరి 11న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వీటితో పాటు ధమాక, రామారావు ఆన్ డ్యూటీ లాంటి మరికొన్ని సినిమాలు రవితేజ ఖాతాలో ఉన్నాయి.