Renu Desai: రేణు దేశాయ్ ఆరోగ్యంపై రూమర్స్.. ఇదిగో క్లారిటీ

pratap reddy   | Asianet News
Published : Nov 18, 2021, 06:15 PM IST
Renu Desai: రేణు దేశాయ్ ఆరోగ్యంపై రూమర్స్.. ఇదిగో క్లారిటీ

సారాంశం

నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తరచుగా తన గురించి, తన పిల్లలు అకిరా నందన్, ఆద్య గురించి పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. 

నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తరచుగా తన గురించి, తన పిల్లలు అకిరా నందన్, ఆద్య గురించి పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. వారి విశేషాలని రేణు దేశాయ్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

కొంత కాలంగా Renu Desai సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా లేదు. దీనికి తోడు ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అంటూ రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఎక్కడా రేణు దేశాయ్ ఆరోగ్యం గురించి సరైన క్లారిటీ రాలేదు. దీనితో అభిమానుల్లో కొంత ఆందోనళ నెలకొంది. 

ఎట్టకేలకు రేణు దేశాయ్ అభిమానుల ఆందోళన తొలగిస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. తన కుమార్తె ఆద్యతో కలసి అందమైన సెల్ఫీని పోస్ట్ చేసింది. రేణు దేశాయ్ కామెంట్ చేస్తూ.. నా రియల్ లైఫ్ హీరో ఆద్య నా సెల్ఫీని ఫోటో బాంబింగ్ చేస్తోంది అంటూ సరదాగా కామెంట్ పెట్టింది. ఇంస్టాగ్రామ్ లో లాంగ్ బ్రేక్ ముగిసింది. నేను ఆరోగ్యంగా బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఆరా తీసినవారందరికీ ధన్యవాదాలు. నా హెల్త్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది మెసేజ్ లు పంపారు అంటూ రేణుదేశాయ్ తెలిపింది. 

ఈ సెల్ఫీలో రేణు దేశాయ్ అందమైన శారీలో ఫుల్ స్మైల్ తో కనిపిస్తోంది. రేణు పక్కనే మరో యువతి కూడా ఉంది. వీరిద్దరి వెనుకాల దాగుడు మూతలు ఆడుతున్న తరహాలో ఆద్య కనిపిస్తోంది. 

Also Read: ఇద్దరు వ్యాపారవేత్తలపై స్నేహ కేసు నమోదు.. షాకింగ్ రీజన్, ఆమెని బెదిరిస్తూ..

Pawan Kalyan నుంచి విడిపోయాక రేణు దేశాయ్ తన పిల్లలతో పూణేలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక అకిరా నందన్ మెగా ఫ్యామిలిలో ప్రతి సెలెబ్రేషన్ కు హాజరవుతున్నాడు. అకీరా టాలీవుడ్ ఎంట్రీ గురించి అప్పుడే రూమర్లు కూడా మొదలయ్యాయి. అకిరా నందన్ ప్రస్తుతం కర్రసాము, ఇతర మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో
Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి