
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూనే ఉన్నారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈమె ఒక ఫోటోను షేర్ చేసిన చిన్న కవితను కూడా రాశారు. పవన్ తో విడిపోయిన తరువాత పిల్లలతో కలిసి పూణెలో ఉంటున్నారు రేణూ. పిల్లలే ఆమెకు ప్రపంచం. వారి ఫోటోలను.. వారితో గడిపిన ఆనందాలను తరచూ షేర్ చేస్తుంటారు.
ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ అయింది. తన ఇద్దరి పిల్లలపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక కవితను రాశారు. తన చెల్లెలు ఆద్యపై తలవాల్చిన అకిరా ఫోటోను షేర్ చేస్తూ.. ''ఒక హార్ట్, ఒక సోల్.. మీకోసం నేను ప్రాణాలు ఇస్తాను, మీ కోసం ప్రాణాలు తీస్తాను. ఓ తల్లి తన పిల్లల కోసం రాసిన చిన్న కవిత.. ఇలాంటి క్యూట్ పిక్స్ చాలానే ఉన్నాయి, ఎప్పటికీ అందిస్తూనే ఉంటా' అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.