రేణుదేశాయ్ అబద్దం చెప్పలేదు.. పవన్ కు కూతురు ముందే పుట్టింది

Published : Jul 13, 2018, 02:42 PM IST
రేణుదేశాయ్ అబద్దం చెప్పలేదు.. పవన్ కు కూతురు ముందే పుట్టింది

సారాంశం

నేను ఉండగానే మరో మహిళతో ఎఫైర్ పెట్టుకొని ఆమెతో బిడ్డను కూడా కన్నాడు అంటూ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేణుదేశాయ్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు

నేను ఉండగానే మరో మహిళతో ఎఫైర్ పెట్టుకొని ఆమెతో బిడ్డను కూడా కన్నాడు అంటూ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేణుదేశాయ్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. గతంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూను షేర్ చేసి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. విడాకులు, పవన్ కూతురు పొలెనా జననం గురించి ప్రశ్నిస్తూ ఆమెకు మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టారు. ఈ విషయంపై రేణుదేశాయ్ పిఆర్ టీమ్ క్లారిటీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

''బేబీ పోలినా పుట్టింది 13 మార్చి 2012. [9 నెలలు అంటే గర్భధారణ అయ్యింది జులై 2011]. విడాకులు ఖరారు అయినది పాప పుట్టిన తరువాత అంటే 16 మార్చి 2012. ఈ వివరణ ఎందుకంటే గత కొన్నిరోజులుగా మాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి, స్వప్న గారితో రేణు గారి ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ మరియు విడాకులు మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.రేణు గారికి పాప పుట్టిన విషయం ఆమెకు తెలిసిన తరువాత శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ విషయాన్నే RK గారి ఇంటర్వ్యూలో ఆమె తెలియజేశారు. రేణు గారికి శిశువు గర్భం దాల్చిన విషయం తెలియదు, ఈ విషయాన్నే ఆవిడ స్వప్న గారితో ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆవిడ PR టీం గా మేము ఈ వివరాలను తెలియచేసి, ఆమె అబద్దం చెప్పారన్న గందరగోళాన్ని తొలిగించడానికే ఈ పోస్ట్'' అంటూ ఆమె PR టీమ్ స్పష్టం చేసింది. 

PREV
click me!

Recommended Stories

రాంచరణ్ కోసం వీధుల్లో తిరిగింది, ఈ మూవీ కోసం అప్పు తీసుకుంది.. కూతురు సుస్మిత సీక్రెట్స్ బయటపెట్టిన చిరు
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?