పవన్ ముఖ్యమంత్రి అవుతాడా..? రేణుదేశాయ్ ఏమంటుందంటే?

Published : Jan 01, 2019, 01:01 PM IST
పవన్ ముఖ్యమంత్రి అవుతాడా..? రేణుదేశాయ్ ఏమంటుందంటే?

సారాంశం

పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని అతడి నుండి విడిపోయిన నటి రేణుదేశాయ్ఇప్పుడు ఫిలిం మేకర్ గా, రైటర్ గా గుర్తింపు తెచ్చుకొనే పనిలో పడింది. 

పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని అతడి నుండి విడిపోయిన నటి రేణుదేశాయ్ ఇప్పుడు ఫిలిం మేకర్ గా, రైటర్ గా గుర్తింపు తెచ్చుకొనే పనిలో పడింది. ఈ క్రమంలో ఆమె ఓ పుస్తకాన్ని రచించింది. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఆమెకి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. 

పవన్ ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారా..? అని రేణుని ప్రశ్నించగా.. దానికి ఆమె ''నేను రాజకీయాలు పెద్దగా ఫాలో అవ్వను. ముఖ్యమంత్రిగా పవన్ కి ఎంత అవకాశం ఉంటుందనే విషయాన్ని నేను చెప్పలేను.. కానీ ఆయనకు ప్రజలకు ఏదోకటి చేయాలనే తపన మాత్రం ఉంటుందని చెప్పగలను. ప్రజలు కోరుకునే మార్పు ఆయన తీసుకురాగలరని నేను భావిస్తున్నాను.

నేనెప్పుడూ ఆయనతో రాజకీయాల గురించి, రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడను. మా ఇద్దరి మధ్య మాటలు మా పిల్లల గురించే ఉంటాయి. నా పిల్లల తండ్రిగా మాత్రమే ఆయన్ని చూస్తాను. పిల్లలపై ఆయనకి చాలా కేర్ ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ సెలవులు అందరూ ఒకచోటే కలిసి గడుపుతున్నారని'' చెప్పుకొచ్చింది. అలానే తనేం రాసినా..  అది పవన్ కళ్యాణ్ గారికోసమే అని అనుకుంటున్నారని తన ఆలోచనలను మాత్రమే కవితలుగా రాస్తుంటానని స్పష్టం చేశారు. 

పెద్ద ఫిలిం మేకర్, రైటర్ గా మంచి పేరు తెచ్చుకొని పవన్ కళ్యాణ్ టాపిక్ లేకుండా తన గురించి మాత్రమే మాట్లాడే రోజు రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పవన్ గురించి మాట్లాడడంపై తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ అది పబ్లిసిటీ కోసమని చాలా మంది అనుకుంటారని తెలిపారు.  

పోలీస్ స్టేషన్ లో కూడా రేప్ చేశారు.. రేణుదేశాయ్ కామెంట్స్!
 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్