పవన్ తో ఉన్నది పన్నెండేళ్లే కదా..!

Published : Dec 13, 2018, 01:38 PM ISTUpdated : Dec 13, 2018, 02:01 PM IST
పవన్ తో ఉన్నది పన్నెండేళ్లే కదా..!

సారాంశం

పవన్ తో ఉన్నది పన్నెండేళ్లే కదా ఉన్నాను.. ఆయన ప్రభావం నా కవితలపై ఎందుకు ఉంటుందని ఆఫ్ ది రికార్డ్ ప్రశ్నింస్తోందట రేణుదేశాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ బయటవాళ్ల దగ్గర రేణు ఈ రకమైన కామెంట్స్ చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి. 

పవన్ తో ఉన్నది పన్నెండేళ్లే కదా.. ఆయన ప్రభావం నా కవితలపై ఎందుకు ఉంటుందని ఆఫ్ ది రికార్డ్ ప్రశ్నింస్తోందట రేణుదేశాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ బయటవాళ్ల దగ్గర రేణు ఈ రకమైన కామెంట్స్ చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకి వస్తే.. 'A love, Unconditional' అంటూ ఓ పుస్తకాన్ని రచించింది రేణు దేశాయ్. ఆమె రాసుకున్న కవితలతో ఈ బుక్ ని రూపొందించింది రేణు. ఈ కవితలు అధ్బుతంగా ఉన్నాయంటూ వాటిని తెలుగులోకి అనువదించిన లిరిక్ రైటర్ అనంత్ శ్రీరాం మెచ్చుకున్నాడు.

రేణు దేశాయ్ ప్రేమకి సంబంధించిన కవితలు రాసిందని తెలియగానే మనకి గుర్తొచ్చేది పవన్ కళ్యాణే.. ఆమె కవితలపై అతడి భావజాలం కనిపిస్తుందేమో అనుకున్నారు. కానీ అటువంటివేవీ ఆమె కవితల్లో కనిపించలేదు.

దీనిపై ఆమె అధికారికంగా ఎలాంటి కామెంట్ చేయలేదు కానీ.. బయటవాళ్ల దగ్గర తన వయసు 37 సంవత్సరాలని ఇన్నేళ్లలో పవన్ తనతో ఉన్నది పన్నెండేళ్లు మాత్రమేనని కాబట్టి ఆయన ప్రభావం ఎందుకు ఉంటుందని ప్రశ్నించిందట. 
  

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు