నటి హన్సికపై కేసు.. కష్టాల్లో సినిమా!

Published : Dec 13, 2018, 01:00 PM IST
నటి హన్సికపై కేసు.. కష్టాల్లో సినిమా!

సారాంశం

కోలివుడ్ లో హన్సికకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న ఖుష్బూ అని అభిమానులు పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తన 50వ సినిమా 'మహా'తో బిజీగా గడుపుతోంది. 

కోలివుడ్ లో హన్సికకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న ఖుష్బూ అని అభిమానులు పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తన 50వ సినిమా 'మహా'తో బిజీగా గడుపుతోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఇందులో హన్సిక కాషాయి వస్త్రాలు ధరించి సింహాసనం లాంటి కుర్చీలో కూర్చొని పొగ తాగుతూ కనిపించింది. ఈ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే చాలా మందిలో ఈ పోస్టర్ వివాదాలకు దారి తీస్తుందనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సినిమాపై నిజంగానే కోర్టులో కేసు పెట్టారు.

ఈ సినిమా పోస్టర్ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ పీఎంకే పార్టీ కోర్టులో కేసు వేసింది. ఈ కేసుని కోర్టు స్వీకరిస్తూ విచారణకి ఆదేశించింది. హీరోయిన్, సినిమా దర్శకనిర్మాతలపై కేసు పెట్టారు. యు.ఆర్.జెమిల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

హన్సికకు కూడా ఇది 50వ సినిమా కావడంతో ఈ సినిమాని ఎంతో ప్రేస్టీజియస్ గా తీసుకుంది. ఇప్పుడు ఈ సినిమాపై కేసు పెట్టడంతో సినిమా భవిష్యత్తు ఏంటనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ వివాదం హన్సిక సినిమాకి ప్రమోషన్ లా ఉపయోగ పడుతుందా..? లేక కష్టాల్లో నెట్టేస్తుందా అనేది చూడాలి!  

PREV
click me!

Recommended Stories

Vijay Rashmika: దేశ వ్యాప్తంగా అన్నదానం, స్వీట్ల పంపిణి.. అభిమానులకు విజయ్‌ దేవరకొండ, రష్మిక సర్‌ప్రైజ్‌
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌