నేను ఆడదాన్ని అనుకొని అన్నిచోట్ల తాకుతూ.. కమెడియన్ కామెంట్స్!

Published : Dec 13, 2018, 01:22 PM IST
నేను ఆడదాన్ని అనుకొని అన్నిచోట్ల తాకుతూ.. కమెడియన్ కామెంట్స్!

సారాంశం

సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. కొందరు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెప్పుకొచ్చారు. 

సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. కొందరు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెప్పుకొచ్చారు. తాజాగా ఓ కమెడియన్ మీటూ ఆరోపణలు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

'కామెడీ నైట్స్ విత్ కపిల్' షోలో బాలీవుడ్ హాస్యనటుడు అలీ అస్గర్ దాది(బామ్మ) పాత్రలో నటించేవాడు. ఈ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలీతో వివిధ రాష్ట్రాలకు చెందిన అభిమానులు కూడా షోలు నిర్వహించేవారు. అలా ఓసారి ప్రైవేట్ షోలో పాల్గొనే అవకాశం రావడంతో దాది గెటప్ వేసుకొని అక్కడకి వెళ్లాడట అలీ.

అయితే అలీని నిజంగానే ఆడదనుకున్న కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు అలీ. ఆయన మాట్లాడుతూ.. ''నేను షోలో అడుగుపెట్టే ముందు యాంకర్ కి నా పేరు చెప్పే ఛాన్స్ ఇవ్వకుండా నేనే స్టేజ్ మీదకి వెళ్లి సర్ప్రైజ్ చేస్తుంటాను.

అయితే షోలో నా ప్రదర్శన మొదలుకావడానికి ముందే అక్కడి ప్రేక్షకులు తాగి ఉన్నారు. అయినా నా ప్రదర్శన నేను ఇస్తూనే ఉన్నాను. ఆ సమయంలో కొందరు వ్యక్తులు నేను ఆడదాన్ని అనుకొని నా నడుము పట్టుకొని గిల్లారు.

అసభ్యకర పనులు చేశారు. నేను చెప్పేది వారు వినే పరిస్థితుల్లో కూడా లేరు. అప్పుడు షోలో పాల్గొన్న ఓ అమ్మాయి నన్ను కాపాడింది'' అంటూ చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Vishwanath and Sons 2 Days Collections: సూర్య విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కి దుమ్ములేపే కలెక్షన్లు.. 2వ రోజు ర్యాంపేజ్‌
Agadha 2 Days Collections రెండో రోజు కలెక్షన్లు జంప్‌.. ఎంఎస్‌ రాజు అగధ మూవీ ఎంత రాబట్టిందంటే?