'బాహుబలి' నిర్మాతల దెబ్బకి ఆగిపోయిన విజయ్ సినిమా!

Published : Jun 21, 2019, 03:42 PM IST
'బాహుబలి' నిర్మాతల దెబ్బకి ఆగిపోయిన విజయ్ సినిమా!

సారాంశం

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన నూతన చిత్రం 'సింధూబాద్'. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కె.ప్రొడక్షన్స్ పతాకంపై రాజరాజన్ ఈ సినిమాను నిర్మించారు. 

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన నూతన చిత్రం 'సింధూబాద్'. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కె.ప్రొడక్షన్స్ పతాకంపై రాజరాజన్ ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం నాడు విడుదల కావాల్సిన ఈ సినిమా ఓ వివాదం కారణంగా ఆగిపోయింది.

'బాహుబలి' సినిమాను తమిళంలో రాజరాజన్ విడుదల చేశారు. మంచి వసూళ్లను కూడా రాబట్టింది. కానీ తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని రాజరాజన్ చెల్లించలేదని 'బాహుబలి' నిర్మాత శోభూ యార్లగడ్డ కోర్టుని ఆశ్రయించారు.

రాజరాజన్ నిర్మించిన 'సింధూబాద్', 'ఎన్నైనోకి పాయుమ్ తోటా' సినిమాలపై కేసు వేశారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ హైకోర్టు రెండు సినిమాల విడుదలైన స్టే విధించింది. అయినప్పటికీ రాజరాజన్ తన సహనిర్మాతలతో కలిసి సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నించారు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

అయితే థియేటర్ యజమానులు దీనికి అంగీకరించలేదు. సినిమా విడుదలైన ఎటువంటి అభ్యంతరం లేదని డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ నుండి సర్టిఫికేట్ తీసుకొస్తేనే స్క్రీనింగ్ వేస్తామని చెప్పారు. సినిమాపై స్టే ఉన్న కారణంగా సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ స్పష్టం చేయడంతో సినిమా విడుదల ఆగిపోయింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్