రాజకీయాల్లోకి ఇళయదళపతి ?.. హోరెత్తుతున్న చెన్నై నగరం!

By tirumala ANFirst Published Jun 21, 2019, 3:16 PM IST
Highlights

తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ కలిగిన హీరోలు ఇళయదళపతి విజయ్, తలా అజిత్. 

తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ కలిగిన హీరోలు ఇళయదళపతి విజయ్, తలా అజిత్. రాజకీయాలపై రజని ఇంకా నాన్చుడు ధోరణిలో ఉన్నారు. తలా అజిత్ తానూ పాలిటిక్స్ కు దూరం అంటూ ప్రకటించేశారు. కానీ విజయ్ కేంద్రంగా మాత్రం ఆయన అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రముఖ దర్శకుడు, విజయ్ తండ్రి చంద్రశేఖర్ తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాల్ని తెరవెనుక చేస్తున్నారట. 

సందర్భం వచ్చినప్పుడల్లా విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తానని కానీ, రానని కానీ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం లేదు. గత ఏడాది విడుదలైన సర్కార్ చిత్ర ఆడియో వేడుకలో 'నేనే సీఎం అయితే సినిమాల్లో ముఖ్యమంత్రి లాగా చేయను' అంటూ పొలిటికల్ హింట్ ఇచ్చారు. 

విజయ్ తండ్రి చంద్రశేఖర్ తన కొడుకు పేరుతో అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.. ఇదంతా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి బేస్ సిద్ధం చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక చంద్రశేఖర్ తరచుగా రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. తద్వారా కూడా విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం చెన్నై నగరం సీఎం విజయ్, రేపటి సీఎం, ప్రజా సీఎం అనే నినాదాలతో హోరెత్తుతోంది. నగరం మొత్తం విజయ్ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తూ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం జూన్ 22న విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయ్ అభిమానులు చెన్నైలో కొన్ని సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. విజయ్ ని కలసి రాజకీయాల్లోకి ఆహ్వానించాలనే ప్రయత్నాలు వారు ఉన్నట్లు తెలుస్తోంది. 

click me!