Redin Kingsley: బుల్లితెర నటిని పెళ్లి చేసుకున్న 'జైలర్' కమెడియన్.. ఎవరీ సంగీత..వైరల్ ఫొటోస్

Published : Dec 10, 2023, 05:46 PM ISTUpdated : Dec 10, 2023, 05:52 PM IST
Redin Kingsley: బుల్లితెర నటిని పెళ్లి చేసుకున్న 'జైలర్' కమెడియన్.. ఎవరీ సంగీత..వైరల్ ఫొటోస్

సారాంశం

తమిళనాట కమెడియన్ రెడిన్ కింగ్స్ లీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన డాక్టర్, బీస్ట్ అలాగే రీసెంట్ బ్లాక్ బస్టర్ జైలర్ చిత్రాల్లో రెడిన్ నటించిన సంగతి తెలిసిందే. 

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాట కమెడియన్ రెడిన్ కింగ్స్ లీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన డాక్టర్, బీస్ట్ అలాగే రీసెంట్ బ్లాక్ బస్టర్ జైలర్ చిత్రాల్లో రెడిన్ నటించిన సంగతి తెలిసిందే. 

జైలర్ చిత్రంలో సునీల్ దగ్గర ఉంటూ ద్రోహి అంటూ ఫన్నీగా డైలాగ్ చెప్పే పాత్రలో రెడిన్ నటించాడు. అయితే రెడిన్ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం రెడిన్ వయసు 46 ఏళ్ళు. లేటు వయసులో రెడిన్ ఓ ఇంటివాడు కావడంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

సంగీతా వి అనే బుల్లితెర నటిని రెడిన్ నేడు ఎంతో సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. దీనితో సంగీతా వి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

సంగీతా వి పలు టివి సీరియల్స్ లో నటిస్తోంది. ఆమె మోడల్ కూడా. సంగీత సీరియల్స్ లోనే కాకుండా సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేస్తోంది. విజయ్ మాస్టర్ చిత్రంలో ఆమె నటించింది. ఆమె వయసు కూడా 45 ప్లస్ అని తెలుస్తోంది. అయితే వీళ్లిద్దరికీ ఎలా పరిచయం అయింది.. రిలేషన్ షిప్ లో ఉన్నారా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనే వివరాలు బయటకి రాలేదు. 

Also Read: సుమ, రాజీవ్ కనకాల విడాకుల రూమర్స్.. అమ్మా నాన్ననే అడిగేశా

ప్రస్తుతం పెళ్లి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం వీరిద్దరూ ఏడాదిగా రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారని పోస్ట్ చేస్తున్నారు. మైసూరులోని చాముండేశ్వరి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. 

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?