ప్రపోజ్ చేసిన అభిమానితోనే.. ఫోన్ లో మాట్లాడి సర్ ప్రైజ్ చేసిన రష్మిక మందన్న.. వీడియో వైరల్

Published : Dec 10, 2023, 03:58 PM ISTUpdated : Dec 10, 2023, 04:02 PM IST
ప్రపోజ్ చేసిన అభిమానితోనే.. ఫోన్ లో మాట్లాడి సర్ ప్రైజ్ చేసిన రష్మిక మందన్న.. వీడియో వైరల్

సారాంశం

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన అభిమానికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. తను ప్రపోజ్ చేసిన వ్యక్తిని అమితాబ్ బచ్చన్ షో ద్వారా పలకరించింది. ప్రస్తుతం ఈ సీన్ నెట్టింట వైరల్ గా మారింది.     

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ‘పుష్ప’లో శ్రీవల్లి పాత్రలో నటించిన తర్వాత  రష్మికకు సౌత్, నార్త్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తన సినిమాల కోసమూ అభిమానులు ఎదురుచూస్తూ  ఉంటారు. సినిమాలు ఉన్నా.. లేకున్నా.. రష్మికను తన ఫ్యాన్స్  సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫాలో అవుతూనే ఉంటారు. తమ అభిమాన హీరోయిన్ ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా రష్మిక మందన్న తన అభిమానిని సర్ ప్రైజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. 

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్ గాప్రసారం అవుతున్న కౌన్ బనేగా క్రోర్ పతి (Kaun Banega Crorepati) సీజన్ 15 ఆసక్తికరంగా మారింది. చాలా ఇంట్రెస్టింగ్ గా షో ముందుకు వెళ్తొంది. తాజాగా ఈ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న. ఆమె అభిమాని అయిన కంటెస్టెంట్ ప్రమోద్ భాస్కర్ (Pramod Bhaskar) తో వీడియో కాల్ లో మాట్లాడింది. ప్రమోద్ భాస్కర్ రశ్మిక మందన్నకు పెద్ద అభిమాని. ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అ‌వుతుంటారు. 

తన ఫేవరేట్ హీరోయిన్ వీడియో కాల్ లో మాట్లాడేసరికి ప్రమోద్ సర్ ప్రైజ్ అయ్యారు. ఆమెను ఎంతగానో అభిమానిస్తున్నాని, పర్సనల్ గా కలిసి మాట్లాడాలని ఉందని ప్రమోద్ అడగగా..రశ్మిక తప్పకుండా మీట్ అవుదామని చెప్పింది. అలాగే తన ఫ్యాన్ అయిన ప్రమోద్ కౌన్ బనేగా కరోర్ పతి ప్రోగ్రాంలో కంటెస్టెంట్ గా ముందుకు వెళ్లడం హ్యాపీగా ఉందని రశ్మిక చెప్పింది. అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ రశ్మిక ప్రతి సినిమాను చూస్తున్నామని, ఇటీవల యానిమల్ సినిమాలో ఆమె పర్ ఫార్మెన్స్ ఎంతో ఆకట్టుకుందని అన్నారు.రశ్మిక అమితాబ్ కు థ్యాంక్స్ చెప్పింది.

ఇక రష్మిక మందన్న ప్రస్తుతం ‘యానిమల్’తో సెన్సేషన్ గా మారింది. బాలీవుడ్ లో అదరగొడుతోంది. వచ్చే ఏడాది తెలుగులో పుష్ప2 : ది రూల్ తో అలరించబోతోంది. అలాగే ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఇవన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. నెక్ట్స్ Pushpa2 The Rule తో మరింత సెన్సేషన్ గా మారనుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : సుమిత్రకు తెలిసిపోయిన అసలు నిజం, జ్యోత్స్న కు మొదలైన టెన్షన్..
Illu Illalu Pillalu: నిశ్చితార్థానికి ముందు అపశకునం, కుట్ర మొదలుపెట్టిన శ్రీవల్లి తల్లిదండ్రులు