దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సెన్సేషన్ రికార్డు

Surya Prakash   | Asianet News
Published : Jun 18, 2021, 11:35 AM IST
దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సెన్సేషన్ రికార్డు

సారాంశం

 యేడాదిన్న వ్యవధిలో ఏకంగా 250 (25 కోట్లు) మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపింది.అంతేకాదు 2.9 లైక్స్ సంపాదించి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది.   

టాక్సీవాలా త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా డియ‌ర్ కామ్రేడ్. విజయ్  సినిమాలు అంటే ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆయ‌న సినిమాల‌కు ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. తొలిసారి త‌న ఇమేజ్ కు తానే ప‌రీక్ష పెట్టుకున్నాడు విజ‌య్. పూర్తిగా ఎమోష‌న‌ల్ క‌థ‌ను ఎంచుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇది కాస్త సాహ‌సం అని తెలిసినా కూడా ఎంచుకున్నాడు విజ‌య్. దాంతో ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. వాటిని అందుకోలేక పోయింది. అభిమానుల‌ను మెప్పించలేకపోయింది. అయితే ఇప్పుడీ సినిమా గురించి టాపిక్ ఎందుకూ అంటే...ఈ సినిమా హిందీ వెర్షన్‌ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

 ‘డియర్ కామ్రేడ్’  మూవీ హిందీలో మాత్రం  ఓ రేంజ్‌లో ఇరగదీస్తోంది. డియర్ కామ్రేడ్‌ చిత్రాన్ని హిందీ ప్రేక్షుకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. సినిమా స్టోరీతో పాటు విజయ్ యాక్టింగ్, విజయ్-రష్మిక రొమాన్స్ అదిరిపోయిందంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. జనవరి 19న యూబ్యూబ్‌లో విడుదలైన డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ వర్షన్ రికార్డుల మోత మోగిస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 12 మిలియన్లు (కోటి 20 లక్షల) వ్యూస్ సాధించిది డియర్ కామ్రేడ్. అంతేకాదు ఇపుడు యేడాదిన్న వ్యవధిలో ఏకంగా 250 (25 కోట్లు) మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపింది.అంతేకాదు 2.9 లైక్స్ సంపాదించి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. 

 కాలేజ్ పాలిటిక్స్.. దానికితోడు ఆవేశం ఉన్న యువ‌కుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ బాగా న‌టించాడంటూ మెచ్చుకుంటున్నారు. ఫ‌స్టాఫ్ లో ర‌ష్మిక, విజ‌య్ మ‌ధ్య వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఆ సీన్స్ ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి హిందీ జనాలకు.  డియ‌ర్ కామ్రేడ్ విజ‌య్ గ‌త సినిమాల మాదిరి కాదు. ఇది కొత్త ప్ర‌యాణం.. కాస్త నెమ్మ‌దిగా సాగే స‌రికొత్త ప్ర‌యాణం అందరూ మెచ్చుకుంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో