గ్రేట్ కాంబినేషన్: ధనుష్ తో శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ

Published : Jun 18, 2021, 09:38 AM ISTUpdated : Jun 18, 2021, 09:46 AM IST
గ్రేట్ కాంబినేషన్: ధనుష్ తో శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ

సారాంశం

 టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. తమ అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియెన్స్ ను ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండటం   ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.   

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. తమ అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియెన్స్ ను ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండటం   ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. 


ధనుష్ తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల తన తాజా ట్వీట్ తో అనౌన్స్ చేశారు. తెలుగు తమిళం హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్వీసీఎల్ఎల్ పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు... శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ములతో రీసెంట్ గా ఈ నిర్మాతలు లవ్ స్టోరి సినిమాను నిర్మించారు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం.ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగ్ డీటెయిల్స్ త్వరలో ప్రకటించనున్నారు.

ఫిదా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల నుండి వస్తున్న లవ్ స్టోరీ మూవీపై సైతం భారీ అంచనాలుండాయి. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన లవ్ స్టోరీ వాయిదా పడింది. నాగ చైతన్య, సాయి పల్లవి మొదటిసారి జంట కట్టగా ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా శేఖర్ తెరకెక్కించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే