మలయాళంలో ‘ఆర్ఆర్ఆర్’ టెలివిజన్ ప్రీమియర్ కు రికార్డ్ స్థాయి రేటింగ్.. తెలుగు వెర్షన్ మాత్రం ఇలా.!

By team teluguFirst Published Aug 26, 2022, 6:41 PM IST
Highlights

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఇప్పటికీ ఏదో రకంగా ట్రెండింగ్ లో ఉంటోంది. ఇటీవల ఈ చిత్రం మలయాళం, తెలుగులో గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ జరగా.. మరో రికార్డును క్రియేట్ చేసింది.  
 

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వచ్చిన బ్లార్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’(RRR). ఈ చిత్రం క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. ఏదోరకంగా ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగిన ఈ చిత్రం అటు ఓటీటీలోనూ అత్యధిక వ్యూయర్ షిప్ తో దూసుకెళ్లి. అయితే ఇటీవల ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ గ్రాండ్ గా జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ లవర్స తమ ఇంట్లోనే సినిమాను ఎంజాయ్ చేశారు. ఆగస్టు 14న ఏకంగా మూడు భాషల్లో.. మూడు ప్రముఖ ఛానెల్స్ లో చిత్రాన్ని ఒకే రోజు ప్రసారం చేసిన విషయం తెలిసిందే. 

అయితే, తెలుగు వెర్షన్ ను ‘స్టార్ మా’లో, మలయాళ వెర్షన్ ను ప్రముఖ ఆసియా నెట్ ఛానెల్ లో, హిందీ వెర్షన్ ను ‘జీ సినిమా’లో ప్రసారం చేశారు. తాజాగా చిత్రం టెలివిజన్ ప్రీమియర్ లోనూ ఓ రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ వెర్షన్ కన్నా మలయాళంలో ‘ఆర్ఆర్ఆర్’ 13.70 రేటింగ్‌తో రికార్డ్ వీక్షకుల సంఖ్యను పొందింది. ఈ రికార్డును మాత్రం తెలుగు ఆడియెన్స్ బ్రేక్ చేయలేకపోయారు. కనీసం టాప్ 10లోనూ రాలేకపోయింది. తెలుగు వెర్షన్ రూ. 19.62తో సాధారణ రేటింగ్‌ను నమోదు చేసింది. అలాగే  ఈ చిత్రం ‘ఆస్కార్’ నామినేషన్ లోనూ ఉండటంతో.. 99 శాతం అవార్డు వచ్చి తీరుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

పీరియాడికల్ డ్రామాగా RRR ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గిరిజన నాయకుడు కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించాడు. వీరి అద్భుతమైన ప్రదర్శనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. రూ. 550 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రంతో  బాక్సాఫీస్ వద్ద రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ఆయా పాత్రాల్లో నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ స్వరాలు సమకుర్చారు.

click me!