సుధీర్ బాబు హర్ట్ అవడానికి అసలు కారణం ఇదేనా?

By Udayavani DhuliFirst Published Oct 23, 2018, 10:30 AM IST
Highlights

ప్రముఖ నటుడు అర్జున్ తనను లైంగికంగా వేధించాడని సినిమా షూటింగ్ సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించారని నటి శ్రుతి హరిహరన్ సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ విషయాన్ని అర్జున్ ఖండించారు. 

"ఇక్కడ వివరించలేని చాలా కారణాల వల్ల నేను వీరభోగ వసంతరాయలు' లో నా పాత్రకు డబ్బింగ్ చెప్పలేకపోయాను.  అవును.. అది నా వాయిస్ కాదు" అని ట్వీట్ చేసి రీసెంట్ గా సుధీర్ బాబు అందరికీ షాక్ ఇచ్చిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది.

ఆయన అలా మాట్లాడటంతో...జనాలకు సినిమా మీద కన్నా...అసలు సుధీర్ బాబు ఎందుకు డబ్బింగ్ చెప్పలేదు అనే విషయంపై ఆసక్తి పెరిగిపోయింది. దాంతో రకరకాలు రీజన్స్ చర్చకు వస్తున్నాయి. కొందరైతే ...పేమెంట్ విషయంలో తేడాలు వచ్చాయి అంటే...మరికొందరు సుధీర్ బాబు ఇచ్చిన సూచనలు దర్శకుడు తీసుకోకపోవటంతో అభిప్రాయబేధాలు వచ్చాయని అంటున్నారు. 

అయితే అందుతున్న రియలబుల్ సోర్స్ ప్రకారం ..సుధీర్ బాబు పాత్ర సినిమాలో దర్శకుడు చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా, లెంగ్తీగా కథకు కీలకంగా ఉందట. అయితే సినిమా పూర్తై డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తే తన క్యారక్టర్ లెంగ్త్ తగ్గటమే కాకుండా ప్రాధాన్యత కూడా తగ్గిందట.

దాంతో సుధీర్ బాబు ఇలా జరిగిందేమిటి అని దర్శకుడుని నిలదీయటం..నిర్మాతని అడగటం జరిగితే..ఎవరూ ఆయనకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారట. దాంతో ఆ విషయం బయిటపెట్టి సినిమాకు బ్యాడ్ నేమ్ తేవటం ఎందుకు అని, తనే డబ్బింగ్ చెప్పకుండా తప్పుకుని తన ఆగ్రహాన్ని వెల్లబుచ్చాడని చెప్పుకుంటున్నారు. సుధీర్ బాబు చేసిందానిలో తప్పేమిలేదని చెప్పుకుంటున్నారు. అయితే ఈ టాక్ లో ఎంతవరకూ నిజముందో కానీ...సుధీర్ బాబు ప్రాజెక్టు నుంచి బయిటకు రావటం మాత్రం బిజినెస్ పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది.

అందుకే  'వీరభోగ వసంత రాయలు' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి లీడ్ యాక్టర్స్ నారా రోహిత్.. శ్రీ విష్ణు.. శ్రియ శరణ్.. ఇలా అందరూ హాజరయ్యినా .. ఒక్క సుధీర్ బాబు మాత్రమే రాలేదు .  ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది  గానీ సుధీర్ బాబు పాత్రకు సొంత డబ్బింగ్ లేకపోవడం మాత్రం మాట్లాడుకునేలా చేసింది.

click me!