VD11: సమంత హాజరు కాకపోవడానికి కారణం అదేనా ?

Published : Apr 22, 2022, 09:55 AM IST
VD11: సమంత హాజరు కాకపోవడానికి కారణం అదేనా ?

సారాంశం

సినిమాల పరంగా సమంత జోరు పెంచింది. ఏప్రిల్ 28న సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా అనే చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే సమంత పాన్ ఇండియా మూవీ యశోద కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. 

సినిమాల పరంగా సమంత జోరు పెంచింది. ఏప్రిల్ 28న సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా అనే చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే సమంత పాన్ ఇండియా మూవీ యశోద కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. 

తాజాగా సమంత మరో చిత్రాన్ని కూడా షురూ చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన సమంత నటించబోతున్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలు నిజమయ్యాయి. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించబోతున్నారు. 

గురువారం రోజు ఈ చిత్రం ఘనంగా ప్రారంభం అయింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే ఈ చిత్రం లాంచింగ్ కార్యక్రమానికి సమంత హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

అయితే సమంత ప్రస్తుతం దుబాయ్ వెకేషన్ లో ఉన్న కారణంగా ఈ చిత్ర లాంచింగ్ కి హాజరు కాలేదని అంటున్నారు. అయితే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. శివ నిర్వాణ చిత్రాల్లో ఎమోషన్స్, రొమాన్స్ బాగా హైలైట్ అవుతాయి. మరి ఈ చిత్రాన్ని శివ నిర్వాణ ఎలా తెరకెక్కించబోతున్నారో చూడాలి. 

శివ నిర్వాణ చివరగా తెరకెక్కించిన టక్ జగదీష్ చిత్రం నిరాశపరిచింది. మహానటి తర్వాత సమంత, విజయ్ దేవరకొండ మరోసారి నటించబోతున్న చిత్రం ఇది. 

PREV
click me!

Recommended Stories

Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా