
ఆచార్య (Acharya) మూవీ చరణ్-చిరంజీవిల మల్టీస్టారర్ గా కొరటాల ఫిక్స్ అయ్యారు. వారిని మదిలో ఉంచుకొని స్క్రిప్ట్ సిద్ధం చేశారు. అయితే అప్పటికే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రకటించారు. షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. రాజమౌళి తన హీరోలు ఇతర చిత్రాల షూటింగ్స్ లో పాల్గొనడానికి ఒప్పుకోరు. కారణం లుక్ పరంగా ఎటువంటి చేంజెస్ రాకుండా ఉండాలని. అందుకే రాజమౌళి ఆచార్య మూవీలో చరణ్ నటించడానికి ఒప్పుకుంటాడా లేదా అనే సందేహం చరణ్, కొరటాల శివ మదిలో మెదిలిందట.
చిరంజీవి(Chiranjeevi)తో చెప్పిస్తే వింటారని ఆయన్ని రంగంలోకి దించారట. చరణ్-చిరు ఒక పూర్తి స్థాయి మల్టీస్టారర్ చేస్తే చూడాలనేది సురేఖ కోరిక. ఆమె కూడా చరణ్ కచ్చితంగా నటించాలంటూ పట్టుబట్టారట. చరణ్ తల్లి సురేఖ కోరికగా చెప్పి చిరంజీవి రాజమౌళిని ఒప్పించారట. అలా ఆచార్యలో చరణ్ (Ram Charan)నటించడానికి మార్గం ఏర్పడిందట.ఈ విషయాన్ని రామ్ చరణ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.
కాగా అప్పట్లో ఆచార్య మూవీలో మహేష్ (Mahesh babu)నటిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లపై దర్శకుడు కొరటాల శివ ఇచ్చారు . ఆచార్యలో ఒకవేళ చరణ్ నటించడం కుదరకపోతే పరిస్థితి ఏంటని కొరటాల చాల టెన్షన్ పడ్డారట. ఈ విషయాన్ని మహేష్ తో కూడా చెప్పారట. అప్పుడు మహేష్ కొరటాలకు హామీ ఇచ్చారట. ఒక వేళ చరణ్ చేయకపోతే ఆ పాత్ర నేను చేస్తన్నారట. కాబట్టి రాజమౌళి ఆచార్య మూవీలో నటించడానికి చరణ్ కి పర్మిషన్ ఇవ్వకపోతే మహేష్ ఈ మూవీలో నటించేవారు.
ఆచార్య ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సోనూ సూద్ విలన్ రోల్ చేస్తున్నారు. మణిశర్మ ఆచార్య చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.