Ghani : 'గని' కన్నడ వెర్షన్ రిలీజ్ ఆపారు… కారణం?

Surya Prakash   | Asianet News
Published : Apr 09, 2022, 03:21 PM IST
Ghani : 'గని' కన్నడ వెర్షన్ రిలీజ్ ఆపారు… కారణం?

సారాంశం

 “గని” మూవీ ప్రెస్ మీట్‌లో నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్దా ఈ చిత్రాన్ని కన్నడలో (డబ్బింగ్ వెర్షన్) ఏప్రిల్ 8న  విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు కన్నడ వెర్షన్ ప్రమోషన్స్ ను స్టార్ యాక్టర్ ఉపేంద్ర చూసుకుంటారని కూడా చెప్పుకొచ్చారు.


వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'గని' సినిమా నిన్న శుక్రవారం రోజున థియేటర్లకు వచ్చింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా కిరణ్  కొర్రపాటి పరిచయమయ్యాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో సయీ మంజ్రేకర్ తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ ఇది .. బాక్సర్ గా హీరో నడిపించే కథ ఇది. అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమాలో ప్రేక్షకులు ఆశించే అంశాలు పెద్దగా లేవు. దాంతో వాళ్ల అంచనాలను అందుకోలేక ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది.
 
ఇక ఈ సినిమా కన్నడ వెర్షన్ ని మొదట ప్లాన్ చేసారు. అయితే కన్నడ రిలీజ్ మాత్రం వాయిదా పడింది. దీంతో కర్ణాటకలో ఉన్న మెగా అభిమానులు అయోమయంలో పడ్డారు.
అంతకుముందు “గని” మూవీ ప్రెస్ మీట్‌లో నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్దా ఈ చిత్రాన్ని కన్నడలో (డబ్బింగ్ వెర్షన్) ఏప్రిల్ 8న  విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు కన్నడ వెర్షన్ ప్రమోషన్స్ ను స్టార్ యాక్టర్ ఉపేంద్ర చూసుకుంటారని కూడా చెప్పుకొచ్చారు. కానీ అందరూ అనుకున్నట్టుగా కన్నడ వెర్షన్ విడుదల కాలేదు. ఆ విషయం గురించి మేకర్స్ నుండి కూడా ఎటువంటి స్పష్టత   రాలేదు.

దాంతో ఇప్పటికే కన్నడ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న “గని” ఎందుకు వెనక్కి తగ్గాడు అన్న విషయంపై సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. అయితే అనుకున్నట్లుగా థియోటర్స్ దొరక్కే ఆపారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఇప్పుడు డివైడ్ టాక్ వచ్చాక ఈ సినిమాని మళ్లీ అక్కడ రిలీజ్ చేసి ఓపినింగ్స్ రప్పించటం కష్టమే. ఈ నేపధ్యంలో  మరి “గని” కన్నడ వెర్షన్ ను ఎప్పుడు విడుదల చేస్తారు ? ఇప్పుడు వాయిదా వేయడానికి గల కారణమేంటి ? అనే విషయాలపై మేకర్సే క్లారిటీ ఇవ్వాలి.

సినిమాలో ఘనంగా చెప్పుకోదగ్గ అంశం ఏదైనా ఉందంటే అది వరుణ్ తేజ్ తపన, అతడి లుక్. బాక్సర్ గా వరుణ్ సరిగ్గా సరిపోయాడు. ఈ క్యారెక్టర్ కోసం అతడు ఎంత కష్టపడ్డాడో కొన్ని సన్నివేశాలు చూస్తే తెలుస్తుంది. గని పాత్రకు న్యాయం చేశాడు వరుణ్. వరుణ్ తర్వాత ఉపేంద్ర పార్ట్ బెస్ట్ అనిపించుకుంటుంది.

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ