Acharya Trailer Update : ‘ఆచార్య’ ట్రైలర్ వచ్చేస్తోంది.. మెగా ఫ్యాన్స్ కు బిగ్ అప్డేట్..

Published : Apr 09, 2022, 03:02 PM IST
Acharya Trailer Update : ‘ఆచార్య’ ట్రైలర్ వచ్చేస్తోంది.. మెగా ఫ్యాన్స్ కు బిగ్ అప్డేట్..

సారాంశం

మెగా ఫ్యాన్స్ కు ‘ఆచార్య’ మూవీ మేకర్స్ బిగ్ అప్డేట్ అందించారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ ట్రైలర్ ను సిద్ధం చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ పై అప్డేట్ అందించారు.   

మెగాస్టార్ చిరంజీవి  Chiranjeevi,రామ్ చరణ్ Ram Charan కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్ట్ చేసిన సినిమా ఆచార్య. రామ్ చరణ్ తో పాటు నిరంజన్ రెడ్డి కలిసి నిర్మించిన ఈసినిమాలో చిరుకు జతగా కాజల్ Kajal Aggarwal, రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే Pooja Hegde నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేయబోతున్నారు. దేవాలయ భూముల విషయంలో అవినీతికి పాల్పడుతున్న అక్రమార్కుల  భరతం పట్టే నక్సలైట్లుగా ఈ సినిమాలో చిరంజీవి -రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఈ లుక్స్ లో చిరు, చరణ్ ను చూసిన మెగా ఫ్యాన్స్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. 

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, పోస్టర్స్, మ్యూజిక్ ట్రాక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ అందించారు. ‘ఆచార్య’Acharya నుంచి బిగ్ ట్రీట్ గా మేకర్స్ ట్రైలర్ ను  (Acharya Trailer) సిద్ధం చేశారు.  ఈ రోజు సాయంత్రం 04 : 59కి  ఈ మెగా ట్రైలర్ అనౌన్స్ మెంట్ ను అందించన్నట్టు మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేళలకు ఈ నెలాఖరులోగా రిలీజ్ కానుడటం పట్ల అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

తొలిసారి రామ్ చరణ్, చిరంజీవి ఫుల్ లెన్త్ క్యారెక్టర్స్ లో కనిపించనుండటంతో మెగా అభిమానుల్లో ‘ఆచార్య’పై మరింత ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇద్దరూ రెబల్స్ గా కనపించనుడటంతో యాక్షన్ కు కొదవలేదనేది అర్థవుతోంది. ఇక రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15లో నటిస్తున్నారు. మెగా స్టార్ కూడా తన తదుపరి చిత్రం ‘గాడ్ ఫాదర్’ చిత్ర షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే