కృతీ సనన్ నటించే రీమేక్ తెలిస్తే నోరెళ్ళబెడతారు‌!

Surya Prakash   | Asianet News
Published : Jun 24, 2021, 03:32 PM IST
కృతీ సనన్ నటించే రీమేక్ తెలిస్తే నోరెళ్ళబెడతారు‌!

సారాంశం

క్రేజీ ప్రాజెక్ట్‌ ఆదిపురుష్‌లో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది కృతి. ఇప్పుడు మరో అదిరిపోయే ఆఫర్ ఆమె దగ్గరకు వచ్చింది. త్వరలో ఆమె ఓ భారీ సినిమా చెయ్యబోతోంది. ముఖ్యంగా అందులో ఆమె క్యారక్టర్ హైలెట్ కానుంది.

 తెలుగులో మహేశ్‌ సరసన నంబర్‌ 1 నేనొక్కడే సినిమాలో నటించిన కృతి.. ఆ తర్వాత బాలీవుడ్‌ చెక్కేసింది. అక్షయ్‌ కుమార్‌తో వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది కృతి. అంతకు ముందు బరేలీకి బర్ఫీ, లుకా చుప్పి చిత్రాలతో బాక్సాఫీస్‌ హిట్లు అందుకుంది కృతి. క్రేజీ ప్రాజెక్ట్‌ ఆదిపురుష్‌లో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది కృతి. ఇప్పుడు మరో అదిరిపోయే ఆఫర్ ఆమె దగ్గరకు వచ్చింది. త్వరలో ఆమె ఓ భారీ సినిమా చెయ్యబోతోంది. ముఖ్యంగా అందులో ఆమె క్యారక్టర్ హైలెట్ కానుంది. ఈ మేరకు ఎగ్రిమెంట్స్ జరుగుతున్నట్లు సమాచారం.
 
వివరాల్లోకి వెళితే... హాలీవుడ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫిల్మ్‌ ‘కిల్‌ బిల్‌’ హిందీ రీమేక్‌లో నటించే అవకాశం కృతీకి దక్కిందట. క్వెంటిన్‌ టరంటినో దర్శకత్వంలో రూపొందిన ‘కిల్‌ బిల్‌’లో ఉమా థుర్మన్‌ హీరోయిన్ గా నటించారు. హిందీ రీమేక్‌లో ఆ పాత్రకు కృతీ సనన్‌ని ఎంపిక చేశారట సినిమా హక్కులు కొన్న నిర్మాత నిఖిల్‌ ద్వివేది. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. 

కృతీ ఇప్పటివరకూ రెండు మూడు చిత్రాల్లో యాక్షన్‌ సన్నివేశాలు చేసినప్పటికీ... ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో యాక్షన్‌ రోల్‌ చేయలేదు. ‘కిల్‌ బిల్‌’ రీమేక్‌ ఆమెకు తొలి యాక్షన్‌ సినిమా అవుతుంది. కృతీతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. వాళ్లు ఎవరనేది త్వరలో తెలుస్తుంది.

పగ, ప్రతీకారం, భావోద్వేగాలతో సాగే ఈ సినిమాలో హంతకులు ‘బిల్‌’ని, అతని మనుషులనూ చంపడమే ధ్యేయంగా హీరోయిన్ప్లాన్‌ చేస్తుంది. హంతకులపై పగబట్టిన భయంకరమైన మహిళగా ఉమా థుర్మన్‌ అద్భుతంగా నటించారు. కృతీ కూడా తనదైన శైలిలో ఈ పాత్రను చేయడానికి రెడీ అవుతున్నారట. యాక్షన్‌ మూవీ కాబట్టి ప్రత్యేకంగా మార్షల్‌ ఆర్ట్స్‌లో ఆమె శిక్షణ తీసుకోనున్నారని సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?