మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో... ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

By team teluguFirst Published Jun 24, 2021, 3:07 PM IST
Highlights

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మేనల్లుడు విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

మెగా ఫ్యామిలీ అంటే స్టార్ హీరోల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో తయారైంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు, పవన్, చరణ్, అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్స్ గా వెలిగిపోతున్నారు. ఇక వరుణ్, ధరమ్ తేజ్ ఓ స్థాయి హీరోగా మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. సాయి ధరమ్ తమ్ముడు వైష్ణవ్ డెబ్యూ మూవీ ఉప్పెనతో భారీ హిట్ కొట్టాడు. కాగా మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో రంగంలోకి దిగుతున్నారు. 

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మేనల్లుడు విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలవల ఫిల్మ్స్ పతాకం పై చక్రధర్ రెడ్డి సమర్పణలో IN రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. బ‌తుకు బ‌స్టాండ్ అనే టైటిల్ పెట్టిన‌ట్లుగా ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు తెలుగు ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో ఈ సినిమా పై ఆస‌క్తి పెరిగుతూ వ‌స్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు సోష‌ల్ మీడియాలో అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. 

ఇటీవ‌లే విడుద‌లైన మొద‌టి పాట యూట్యూబ్ లో  విశేషాద‌ర‌ణ అందుకుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా విడుద‌లైన‌ బ్రేజిలియ‌న్ మోడ‌ల్ జెన్నీఫ‌ర్ పిక్కినాటో చిందేసిన బుస్సా బుస్సా అంటూ సాగే ఓ మాస్ ఐట‌మ్ సాంగ్ కు సోష‌ల్ మీడియాతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా చిత్ర ద‌ర్శ‌కుడు ఐ.ఎన్. రెడ్డి తెలిపారు, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ముగిసింద‌ని, త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా చిత్ర నిర్మాత‌లు తెలిపారు.

  
 

click me!