'RDX లవ్' మూవీ ట్రైలర్..!

Published : Sep 10, 2019, 04:25 PM IST
'RDX లవ్' మూవీ ట్రైలర్..!

సారాంశం

ఆర్ఎక్స్ 100 సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై హీటెక్కించిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మరోసారి తన గ్లామర్ తో వెండితెరను ఎటాక్ చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ RDXలవ్ అనే సినిమాతో బిజీగా ఉంది. ఆ సినిమా మరికొన్ని వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ 'RDX లవ్' అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో పాయల్ చాలా బోల్డ్ గా కనిపించింది. తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

ట్రైలర్ ని బట్టి ఓ ఊరు చుట్టూ తిరిగే కథగా తెలుస్తోంది. 'నిజంగా మా ఊరి సమస్య తీరుతుందంటే.. ఊరంతా ఆత్మాహుతి చేసుకుంటాం' అంటూ సీనియర్ నటుడు నరేష్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ ఊరి సమస్యను తీర్చడానికి పాయల్ ఎంటర్ అవుతుంది.

ఆమె  ఊరి సమస్యను ఎలా పరిష్కరించిందనేది తెరపై చూడాల్సిందే. ట్రైలర్ చివరలో.. 'వేటాడాలనుకున్న మగాడికి ఆడపిల్ల లేడి పిల్లలా కనిపించవచ్చు. అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకి మగ సింహం కూడా కుక్కపిల్లలా కనిపిస్తుంది' అంటూ పాయల్ రాజ్ పుత్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

శంకర్ భాను డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. రాధన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?