త్వరలో కాళోజి బయోపిక్..డిటేల్స్!

By AN TeluguFirst Published Sep 10, 2019, 3:58 PM IST
Highlights

కాళోజీకి సంబంధించిన దస్తావేజులు, ఫొటోలు, గ్రంథాలు సేకరించి సూత్రప్రాయంగా ఓ స్టోరీ లైన్ అనుకున్నామని నిర్మాత విజయనిర్మల జైనీ వెల్లడించారు. కాళోజీకి అత్యంత సన్నిహితులను సంప్రదించి స్క్రీన్‌ప్లేకు తుదిరూపం ఇచ్చి త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు ప్రభాకర్ జైనీ పేర్కొన్నారు. 

బయోపిక్ ల సీజన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే తెలుగులో రాజకీయ నాయకులు ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితాలతో బయోపిక్ లు వచ్చాయి. ఇప్పుడు ప్రముఖ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మ విభూషణ్‌ కాళోజి నారాయణరావు జీవితం వెండితెరకు రానుంది.‘అమ్మా నీకు వందనం, ప్రణయ వీధుల్లో.. పోరాడే ప్రిన్స్, క్యాంపస్‌–అంపశయ్య’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డా. ప్రభాకర్‌ జైనీ దర్శకత్వంలో ‘కాళన్న’ పేరుతో కాళోజి బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. జైనీ క్రియేషన్స్‌ పతాకంపై విజయలక్ష్మి జైనీ నిర్మిస్తారు.

దర్శకుడు ప్రభాకర్ జైనీ ఆ వివరాలను ప్రకటనలో అందిస్తూ -2019 సెప్టెంబర్ 9 కాళోజీ 105వ జయంతి. 1992లో భారత ప్రభుత్వ నుంచి పద్మవిభూషణ్ అందుకున్న కాళోజీ జీవిత విశేషాలు, ఆయన రచనలు, స్వాతంత్య్ర పోరాట విశేషాలను ఈ తరానికి తెలియచేసే ఉద్దేశం, మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి హారతిపట్టిన వారి జీవిత విశేషాలను దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలనే ఆలోచనతో ‘కాళన్న’ పేరిట బయోపిక్‌ను ప్రారంభిస్తున్నాం.

కాళోజీకి సంబంధించిన దస్తావేజులు, ఫొటోలు, గ్రంథాలు సేకరించి సూత్రప్రాయంగా ఓ స్టోరీ లైన్ అనుకున్నామని నిర్మాత విజయనిర్మల జైనీ వెల్లడించారు. కాళోజీకి అత్యంత సన్నిహితులను సంప్రదించి స్క్రీన్‌ప్లేకు తుదిరూపం ఇచ్చి త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు ప్రభాకర్ జైనీ పేర్కొన్నారు.  ఈ చిత్రానికి కెమెరా: రవి కుమార్‌ నీర్ల, సంగీతం: ఘంటసాల విశ్వనాథ్, మహమ్మద్‌ సిరాజుద్దీన్‌. 

click me!