మాస్ మహారాజా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. రవితేజ తాజాగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణసుర’ నుంచి క్రేజీ అప్డేట్ అందింది. మూవీ టీజర్ ను రిలీజ్ కు సిద్ధం చేసినట్టు యూనిట్ అఫిషీయల్ అప్డేట్ ఇచ్చింది.
మాస్ మహారాజ రవితేజ (Raviteja) తాజాగా నటిస్తున్న చిత్రం యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘రావణసుర’ (Ravanasura). త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమా నుంచి అప్డేట్ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఈ క్రమంలో చిత్ర టీజర్ ను కూడా విడుదలకు సిద్ధం చేశారు.
తాజాగా అఫీషియల్ అప్డేట్ అందిస్తూ.. చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. మార్చి 6న ఉదయం 10 :08 గంటలకు టీజర్ ను వదలనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన కొత్తపోస్టర్ ఆకట్టుకుంటోంది. మాస్ మహారాజా బాడీ లాంగ్వేజీ, లుక్స్, అటిట్యూడ్ పూర్తిగా భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీజర్ కూడా రాబోతుండటంతో ఫ్యాన్స్ లో మరింత ఆత్రుత పెరిగింది.
‘రావణసుర’ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటర్ ఈ సినిమాలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఊహించని మలుపులు, స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
చిత్రంలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. కుర్ర భామలు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు ఆయా పాత్రలు పోషిస్తున్నారు. ఇక రవితేజ చివరిగా ‘ధమాఖా’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రమూ అంతే విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మాస్ మహారాజా ‘టైగర్ నాగేశ్వర్ రావు’పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
Teaser on March 6th at 10:08 AM 😎 pic.twitter.com/y1qRdBH3Lc
— Ravi Teja (@RaviTeja_offl)