మంచు వారి ఇంట పెళ్లి సందడి? ఇవాళే మెహందీ వేడుక.. మోహన్ బాబు హాజరు కాలేదా?

Published : Mar 01, 2023, 04:57 PM ISTUpdated : Mar 01, 2023, 05:06 PM IST
మంచు వారి ఇంట పెళ్లి సందడి? ఇవాళే మెహందీ వేడుక.. మోహన్ బాబు హాజరు కాలేదా?

సారాంశం

మంచు వారి ఇంట పెళ్లి సందడి మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంచు మనోజ్ పెళ్లి తేదీపై గట్టి ప్రచారం జరగగా.. ఈరోజు మెహందీ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.   

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు రెండో కొడుకు.. యంగ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంచు వారి ఇంట పెళ్లి సందడి మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది.  దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనిక రెడ్డి (Bhuma Mounika Reddy)తో మనోజ్ వివాహం గ్రాండ్ జరుగుతుందని గతంలో బాగా ప్రచారం జరిగింది. ఇక ఈరెండ్రోజుల నుంచి మరింత గట్టిగా వినిపిస్తోంది. మార్చి 3న వీరి వివాహం ఘనంగా జరుగుతుందని ఇప్పటికే ఇన్ సైడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. 

అతికొద్ది మంది సభ్యులతో మంచు మనోజ్ - మౌనికా రెడ్డి వివాహాం జరుగుతున్నట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అక్క మంచు లక్ష్మి ఇంట్లోనే నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ కాబోయే జంట.. ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఈరోజు మెహందీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి మనోజ్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైట్ షర్ట్ లో మనోజ్ పెళ్లి వేడుకలో మెరిసినట్టు తెలుస్తోంది. ఇక మనోజ్ పెళ్లిపై అధికారిక ప్రకటన అందాల్సి ఉంది. 

మరోవైపు కొద్దిరోజులు మంచు మనోష్ కు వారి కుటుంబ సభ్యులకు కాస్తా పడటం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనోజ్ మెహందీ వేడుకల్లో తండ్రి Mohan babu లేడనే ప్రచారం జరుగుతోంది. మనోజ్ రెండో పెళ్లిపై తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనకు నచ్చలేదని ప్రచారం. దీంతో కనీసం పెళ్లికైనా వస్తారా? లేదా? అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. ఏదేమైనా మంచు మనోజ్ రెండో పెళ్లితో కొత్త ఫేజ్ లోకి అడుగుపెట్టబోతున్నారని.. ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2019లోనే మనోజ్ తన మొదటి భార్య ప్రణీత రెడ్డికి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మనోజ్ చాలా కాలం తర్వాత సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు. రీసెంట్ గా తన నెక్ట్స్ ఫిల్మ్ ‘వాట్ ది ఫిష్’ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?