`మిసెస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి`గా అనుష్క శెట్టి, నవీన్‌ పొలిశెట్టి.. క్రేజీగా ఫస్ట్ లుక్‌

Published : Mar 01, 2023, 05:01 PM IST
`మిసెస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి`గా అనుష్క శెట్టి, నవీన్‌ పొలిశెట్టి.. క్రేజీగా ఫస్ట్ లుక్‌

సారాంశం

అనుష్క శెట్టి, నవీన్‌ పొలిశెట్టి జంటగా నటిస్తున్న సినిమాకి టైటిల్‌ని ఖరారు చేశారు. `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` అనే ఆసక్తికరమైన టైటిల్‌ని నిర్ణయించారు. తాజాగా ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు.

అనుష్క శెట్టి మూడేళ్ల గ్యాప్‌ తర్వాత ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో `జాతిరత్నాలు` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. అనుష్కకి జోడీగా నవీన్‌ పొలిశెట్టి చేస్తుండటం విశేషం. దీంతో సినిమా ప్రకటించినప్పట్నుంచే దీనిపై ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి. మహేష్‌బాబు అనే నూతన దర్శకుడు దీన్నిరూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది టీమ్‌. దీనికి `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

బుధవారం సాయంత్రం ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులో అనుష్క ఓ పుస్తకం పట్టుకుని తన డ్రీమ్‌లోకి వెళ్లిపోయి ఏదో ఆలోచిస్తుంది. మరోవైపు గోడపై కూర్చొని నవీన్‌ పొలిశెట్టి తన డ్రీమ్‌లోకి వెళ్లిపోయారు. ఊహల్లో తేలియాడుతున్నాడు. అయితే అనుష్క లండన్‌లో ఉండగా, నవీన్‌ హైదరాబాద్‌లో ఉండటం విశేషం. మరి వీరిద్దరికి ఎలా కనెక్షన్‌ కుదిరింది. మరి వీరిద్దరి కథేంటి అనేది ఆసక్తికరంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రం ఓ రోలర్ కోస్టర్‌గా ఫన్‌ రైడర్‌గా ఉండనుందని యూనిట్‌ తెలిపింది. 


అనుష్క, నవీన్ పేర్లు కలిసి వచ్చేలా.. చూడగానే ఆకట్టుకునేలా ఈ చిత్రానికి "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" అనే టైటిల్ ను ఖరారు చేసింది చిత్రబృందం. ఈ టైటిల్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. చాలా క్యాచీగా ఉండటంతో పాటు సినిమా కథకు కూడా ఈ టైటిల్ సరిగ్గా సరిపోయేలా ఉంటుంది అంటోంది మూవీ టీమ్. ఈ సినిమాలో నవీన్.. సిద్ధు పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్ గా, అనుష్క.. అన్విత రవళిశెట్టి అనే చెఫ్‌ పాత్రలో నటించారు. పి. మహేష్‌ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. 

`యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గతంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన `భాగమతి ` బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు రాబోతోన్న ఈ "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" చిత్రాన్ని కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొంచించాడు దర్శకుడు పి. మహేష్‌ బాబు. `నిశ్శబ్దం` చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న అనుష్క.. తన ఇమేజ్ కు తగ్గట్టుగా అద్బుతమైన స్క్రిప్ట్ కావడంతో  కొంత గ్యాప్ తర్వాత ఈ పాత్రకు ఓకే చెప్పింది. `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ`, `జాతిరత్నాలు` సినిమాలతో యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల చేత మంచి నటుడుగా ప్రశంసలు అందుకున్న నవీన్ పోలిశెట్టి కూడా కాస్త గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా ఇది. ఇక టైటిల్ తోనే భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ వేసవికి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల చేయనున్నాం` అని తెలిపింది యూనిట్‌.

 ఆసక్తికరమైన కలయికలో రాబోతోన్న ఈ చిత్రానికి సంగీతంః రధన్, సినిమాటోగ్రఫీః నీరవ్ షా, ఎడిటర్ః కోటగిరి వెంకటేశ్వరరావు, పిఆర్.వోః జి.ఎస్.కె మీడియా, నిర్మాణ సంస్థః యూవీ క్రియేషన్స్, నిర్మాతలుః వంశీ - ప్రమోద్, రచన, దర్శకత్వంః మహేష్‌ బాబు. పి.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?