Raviteja : మరో వారసుడొస్తున్నాడు... హీరోగా రవితేజ కొడుకు ఎంట్రీ?

Published : Apr 27, 2022, 02:31 PM IST
Raviteja : మరో వారసుడొస్తున్నాడు... హీరోగా రవితేజ కొడుకు ఎంట్రీ?

సారాంశం

హీరోల కుమారులు హీరోలు కావడం చాలా కామన్. ఈ ట్రెండ్ కొనసాగిస్తూ మరో వారసుడు రంగ ప్రవేశం చేస్తున్నాడని సమాచారం. రవితేజ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట.  

రవితేజ (Raviteja)కూడా తన తనయుడు మహాధన్ ను హీరోగా పరిచయం చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ చేసిన 'రాజా ది గ్రేట్' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో రవితేజ తనయుడు మహాధన్ కూడా కనిపించాడు. అదే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహాధన్(Mahadhan) హీరోగా పరిచయం కానున్నాడనేది తాజా సమాచారం.

అనిల్ రావిపూడి ఒక యూత్ ఫుల్ స్టోరీని చేయాలనుకుంటున్నాడట. కాలేజ్ నేపథ్యంలో నడిచే ఈ కథలో హీరోగా మహాధన్ అయితే బాగుంటాడని భావించి, రవితేజను సంప్రదించారట. అందుకు రవితేజ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

ఇక రవితేజకు ఇద్దరు పిల్లలు కాగా మహాధన్ తో పాటు మరో అమ్మాయి ఉన్నారు. వీరిద్దరూ టీనేజ్ ఆల్మోస్ట్ దాటేశారు. స్టిల్ యువకుడిలా కనిపిస్తున్న రవితేజకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారంటే నమ్మడం కష్టమే. మరో వైపు ఆయన హీరోగా పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. రామారావు ఇన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరావు, ధమాకా తో పాటు రావణాసుర చిత్రాలలో ఆయన నటిస్తున్నారు.

ఇక క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన రవితేజకు ఖిలాడి షాక్ ఇచ్చింది. ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయితే రవితేజ అప్ కమింగ్ చిత్రాలపై మంచి అనచనాలున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?
Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 10 ఎపిసోడ్ : డబ్బులు ఇస్తూ బుద్ధి బయటపెట్టిన మనోజ్, వద్దని షాకిచ్చిన బాలు..!