Blockbuster Kushi Completes 21years: పవన్ కళ్యాణ్ ఖుషికి 21 ఏళ్ళు!

Published : Apr 27, 2022, 12:45 PM IST
Blockbuster Kushi Completes 21years: పవన్ కళ్యాణ్ ఖుషికి 21 ఏళ్ళు!

సారాంశం

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఖుషి ఓ స్పెషల్ మూవీ. ఆ రోజుల్లో యువతను ఓ ఊపు ఊపిన చిత్రమది. పవన్ కెరీర్ లో అతిపెద్ద విజయంగా ఉన్న ఖుషి నేటికి 21ఏళ్ళు పూర్తి చేసుకుంది. 

లవ్, రొమాన్స్, ఎమోషన్స్, కామెడీ, సాంగ్స్, యాక్షన్ అన్నీ కలగలిపి ఓ కంప్లీట్ మూవీగా ఖుషి(Kushi) తెరకెక్కించారు. వరుస విజయాలతో జోరు మీదున్న పవన్ ఇమేజ్ ని మరోస్థాయికి తీసుకెళ్లింది. పవన్ ఒక్క దెబ్బతో స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఈ చిత్రంతో సొంతం చేసుకున్నారు. గోకులంలో సీత చిత్రం తర్వాత విడుదలైన సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి మంచి విజయాలందుకున్నాయి. 

ఖుషి తమిళ హిట్ మూవీ ఖుషి రీమేక్. తమిళంలో విజయ్, జ్యోతిక జంటగా నటించారు. ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన ఎస్ జె సూర్య తెలుగు వర్షన్ కి కూడా దర్శకత్వం వహించారు. ఏ ఎం రత్నం నిర్మాత. పవన్ కి జంటగా భూమిక(Bhumika)ను ఎంపిక చేశారు. సమ్మర్ కానుకగా 2001 ఏప్రిల్ 27న విడుదలైంది. ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్. పవన్-భూమిక కెమిస్ట్రీ సినిమాలో అద్భుతంగా పండింది. భూమిక నడుము సన్నివేశం ఎవర్ గ్రీన్ రొమాంటిక్ సన్నివేశంగా మిగిలిపోయింది. మణిశర్మ సాంగ్స్ సినిమా విజయంలో కీలక పాత్ర వహించాయి. 

సినిమాలోని ప్రత్తిపాట ఓ ఆణిముత్యం. పవన్ ఏడవ చిత్రంగా విడుదలైన ఖుషి వసూళ్ల వర్షం కురిపించింది. నిర్మాతలు, బయ్యర్లు ఈ మూవీతో బాగా ఆర్జించారు. ఈ సినిమా తర్వాత పవన్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. అయితే పవన్ (Pawan Kalyan)మాత్రం ఫ్యాన్స్ ని నిరాశపరిచాడు. ఖుషి తర్వాత ఏకంగా రెండేళ్లు సినిమాలు చేయలేదు. ఇక 2003లో స్వీయ దర్శకత్వంలో జానీ మూవీ చేశారు. ఈ సినిమాలో పవన్ లుక్ పూర్తిగా మారిపోయింది. ఖుషి మూవీ సూపర్ హ్యాండ్ సమ్ గా ఉన్న పవన్ జానీ చిత్రం నాటికి బక్క చిక్కి, మీసం లేకుండా డిఫరెంట్ లుక్ ట్రై చేశాడు. 

ఖుషి తర్వాత చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైంది.అనూహ్యంగా జానీ పరాజయం పాలైంది. అలాగే పవన్ వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. 2008లో విడుదలైన జల్సా వరకు ఆయన హిట్టు ముఖం చూడలేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?