Raviteja:రామారావు టీజర్ రెడీ... రవితేజ స్పీడ్ మామూలుగా లేదుగా

Published : Feb 26, 2022, 05:54 PM ISTUpdated : Feb 26, 2022, 05:58 PM IST
Raviteja:రామారావు టీజర్ రెడీ... రవితేజ స్పీడ్ మామూలుగా లేదుగా

సారాంశం

రవితేజ స్పీడు మాములుగా లేదు. క్రాక్ మూవీ తర్వాత ఐదు సినిమాల వరకు ప్రకటించాడు. వాటిలో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి కాగా ఈ చిత్ర టీజర్ పై అప్డేట్ ఇచ్చాడు.   

వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ రవితేజకు (Ravi teja)క్రాక్ రూపంలో బ్లాక్ బస్టర్ దొరికింది. ప్రతికూల పరిస్థితుల మధ్య 2021 సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ భారీ వసూళ్లు రాబట్టింది. ఈ ఊపులో రవితేజ వరుసగా చిత్రాలు ప్రకటించారు. ఖిలాడి చిత్రాన్ని చకచకా పూర్తి చేసి విడుదల చేశాడు. ఖిలాడి చిత్రం రవితేజకు షాక్ ఇచ్చింది. పాన్ ఇండియా చిత్రంగా హిందీలో కూడా విడుదల చేశారు. అక్కడ ఈ సినిమాకు కనీస ఆదరణ కరువైంది. తెలుగులో కూడా రిజల్ట్ రిపీటైంది. దర్శకుడు రమేష్ వర్మతో రవితేజకు విబేధాలు తలెత్తాయి. ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా ఇద్దరి మధ్య గొడవలు బట్టబయలయ్యాయి. 

ఇక కెరీర్ లో గెలుపోటములు సహజమే. దీంతో రవితేజ అవేమి పట్టించుకోకుండా... తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కాగా రవితేజ నెక్స్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. చిత్రీకరణ దాదాపు పూర్తి కాగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మార్చి 25న విడుదల చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. అయితే ఆర్ ఆర్ ఆర్ అదే రోజున విడుదల చేస్తున్నట్లు ప్రకటన రావడంతో పోస్ట్ ఫోన్ చేశారు. పెద్ద చిన్న చిత్రాలు అనేకం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరైన స్లాట్ కోసం రామారావు టేం ఎదురుచూస్తుంది. 

కొంచెం లేటైనా సమ్మర్ కానుకగా రామారావు విడుదల కానుంది. దీంతో రామారావు ప్రొమోషన్స్ (Ramarao on duty teaser)షురూ చేశారు. మార్చి 1న ఈ చిత్ర టీజర్ విడుదల చేస్తున్నారు. నేడు ఈ మేరకు ప్రకటన చేయడం జరిగింది. శరత్ మండవ రామారావు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఉన్నారు. రామారావు చిత్రంలో మజిలి ఫేమ్ దివ్యంష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

మరోవైపు రవితేజ ధమాకా షూటింగ్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ వేదికగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ధమాకా చిత్రంతో పాటు టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర చిత్రాలలో రవితేజ నటిస్తున్నారు. ఇవన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే రవితేజ నుండి మరో రెండు చిత్రాల విడుదల ఉండవచ్చు. 

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం