Radheshyam Story Secret: ప్రభాస్‌ పాత్ర ఇన్‌స్పిరేషన్‌ ఏంటో రివీల్‌ చేసిన దర్శకుడు.. ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్‌

Published : Feb 26, 2022, 03:52 PM IST
Radheshyam Story Secret:  ప్రభాస్‌ పాత్ర ఇన్‌స్పిరేషన్‌ ఏంటో రివీల్‌ చేసిన దర్శకుడు.. ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్‌

సారాంశం

సినిమా కథా నేపథ్యం, ప్రభాస్‌ పాత్రపై స్పందిస్తూ, హస్త జాతకులు(పాల్మిస్ట్) నేపథ్యంలో ప్రపంచంలో పెద్దగా సినిమాలు రాలేదు. అలా ఓ సినిమా చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో `రాధేశ్యామ్‌` కథ రాసుకున్నట్టు దర్శకుడు రాధాకృష్ణ తెలిపారు. 

ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ తోపాటు, ఇండియా సినీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) నటించిన `రాధేశ్యామ్‌`(Radheshyam Movie) చిత్రం. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి `జిల్‌` ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ అప్‌డేట్లతో జోరు పెంచింది. అందులో భాగంగా చిత్ర దర్శకుడు రాధాకృష్ణ శనివారం మీడియాతో ముచ్చటించారు. 

దర్శకుడు రాధాకృష్ణ(Radhakrishna) చెబుతూ, `రాధేశ్యామ్` స్టోరీ చెప్పిన వెంట‌నే అందులో ఉన్న మెయిన్ పాయింట్ కి ప్ర‌భాస్ గారు చాలా ఎక్సైట్ అయ్యారు, త‌న పోషిస్తున్న విక్ర‌మాదిత్య పాత్ర‌లో ఉన్న విభిన్న షేడ్స్ విష‌యంలో ప్ర‌భాస్ గారు చాలా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి న‌టించినట్టు తెలిపారు. `పూజా హెగ్డే(Pooja Hegde), Prabhas మధ్య లవ్‌ స్టోరీ, కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. విజువల్స్ సినిమాకి ప్లస్‌. ఇదొక విజువల్‌ వండర్‌లా ఉంటుందని చెప్పొచ్చు. కోవిడ్ కి ముందు ఇట‌లీ, ఇత‌ర యూర‌ప్ దేశాల్లో షూట్ చేశాము, కోవిడ్ కార‌ణంగా వ‌చ్చిన ఆంక్ష‌లు కార‌ణంగా ఇట‌లీని హైద‌రాబాద్ కి షిఫ్ట్ చేశామనేతంగా భారీ సెట్స్ మ‌ధ్య రాధేశ్యామ్ షూటింగ్ జ‌రిగింది` అని వెల్లడించారు ప్రభాస్‌. వీఎఫ్‌ఎక్స్ ఉక్రేయిన్‌లో చేయించామన్నారు.

సినిమా కథా నేపథ్యం, ప్రభాస్‌ పాత్రపై స్పందిస్తూ, హస్త జాతకులు(పాల్మిస్ట్) నేపథ్యంలో ప్రపంచంలో పెద్దగా సినిమాలు రాలేదు. అలా ఓ సినిమా చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో `రాధేశ్యామ్‌` కథ రాసుకున్నట్టు దర్శకుడు రాధాకృష్ణ తెలిపారు. అయితే ఇందులో ప్రభాస్‌ పాత్రకి మాత్రం యూరప్‌కి చెందిన కీరో అనే పాల్మిస్ట్ ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పారు. ఆయన ఇండియాకి వచ్చి జోతిష్యం, హస్తసాముద్రికం, జాతకాలు ఇలా అన్నింటిని నేర్చుకుని అక్కడ ప్రెసిడెంట్లు, ప్రధానులు, రాజుల స్థాయి వారికి పాల్మనాలజీ చెప్పేవారు. వారు ఎన్నికల్లో గెలుస్తారా? ఓడిపోతారా? ఎన్ని సీట్లు వస్తాయి లాంటివన్నీ చెప్పేవారు. 

అయితే వారి జీవితంలో ఎదురైన కొన్ని రియల్‌ సంఘటనల ఆధారంగా ప్రభాస్‌ని పాత్రని డిజైన్‌ చేసినట్టు చెప్పారు దర్శకుడు రాధాకృష్ణ. ఈ చిత్రాన్ని ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో చేయాలనుకున్నాం. కానీ ప్రభాస్‌ గారీ సలహా మేరకు విదేశాలకు మార్చాం. యూరప్‌లోని ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో కథ సాగుతుంది. విధికి, ప్రేమకి మధ్య సంఘర్షణ ప్రధానంగా సినిమా సాగుతుంది. జ్యోతిష్యం గొప్పదా, సైన్స్ గొప్పదా, జ్యోతిష్యంలో నమ్మకం ఏంటి? నిజమేంటి? నేను ఏది బిలీవ్‌ చేస్తాననేదే ఈ చిత్రానికి కన్‌క్లూజన్‌. 

సినిమా చాలా నిజాయితీగా చేశాం. యూనివర్సల్‌ కాన్సెప్ట్ కావడంతో సినిమా అన్ని వర్గాలకు నచ్చుతుంది. తెలుగు మాత్రమే కాదు, హిందీ ఆడియెన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. పీరియాడికల్‌ ప్రేమ, పోయిటిక్‌ లవ్‌ స్టోరీ అనేది హృదయాన్ని హత్తుకునేలా ఉంటుందని చెప్పారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థ‌మ‌న్ త‌న అద్భుత‌మైన రీరికార్డింగ్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారని తెలిపారు. కృష్ణంరాజు పాత్ర గురించి చెబుతూ ఆయనది ప్రత్యేకమైన పాత్ర అని, కృష్ణంరాజుని తీసుకోవాలనేది ప్రభాస్‌ ఛాయిస్‌ అని వెల్లడించారు.

సోషల్‌ మీడియాపై దర్శకుడు రాధాకృష్ణ స్పందిస్తూ ప్రస్తుతం సోషల్‌ మీడియా చాలా శక్తివంతంగా అవతరించింది. దేశాల ప్రభుత్వాలనే మార్చే అంత శక్తిగా ఎదిగింది. సినిమాల ప్రమోషన్‌కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇటీవల అప్‌డేట్లకి సంబంధించిన ట్రోల్స్ నేను చూసుకోలేదు. చూసుకున్నప్పుడు వెంటనే అప్‌డేట్లు ఇచ్చాను. అయితే కరోనా వల్ల షూటింగ్‌లు ఆలస్యం, టీమ్‌లో మాకు కోవిడ్‌ రావడం, నెక్ట్స్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏం అప్‌డేట్లు ఇవ్వాలో అర్థం కాలేదు. దాని వల్ల కాస్త అప్‌డేట్లు డిలే అయ్యాయి. సినిమా కోసం జనం ఈ రేంజ్‌లో ఎదురుచూడటం చాలా ఆనందంగా ఉందన్నారు దర్శకుడు రాధాకృష్ణ. 

ప్రమోషన్‌ కార్యక్రమాలపై స్పందిస్తూ.. ఈ సారి భారీగా ప్రమోషన్లు ప్లాన్‌ చేసినట్టు చెప్పారు. తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీలో, సౌత్‌లోనూ ఈవెంట్లు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. తన నెక్ట్స్ సినిమాల గురించి రియాక్ట్ అవుతూ, ఇంకా ఏది అనుకోలేదని, కొన్ని ఐడియాలున్నాయన్నారు. నెక్ట్స్ కూడా పాన్‌ ఇండియా చిత్రం ఉండే అవకాశాలున్నాయని తెలిపారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?