Ante Sundaraniki: నాని ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్... అంటే సుందరానికీ ఓటీటీలో 

Published : Jun 22, 2022, 05:00 PM ISTUpdated : Jun 22, 2022, 05:06 PM IST
Ante Sundaraniki: నాని ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్... అంటే సుందరానికీ ఓటీటీలో 

సారాంశం

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ ఎంటర్టైనర్ అంటే సుందరానికీ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ దక్కించుకోగా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.   


జూన్ 10న విడుదలైన అంటే సుందరానికీ (Ante Sundaraniki) మూవీ థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాట లేకపోయింది. పూర్ ఓపెనింగ్స్ దక్కించుకున్న అంటే సుందరానికీ చిత్రం అదే ట్రెండ్ కొనసాగించింది. వీకెండ్ ముగిశాక వసూళ్లు మరింత దారుణంగా పడిపోయాయి. ఫస్ట్ వీక్ ముగిసే నాటికే థియేటర్స్ లో అంటే సుందరానికీ సందడి తగ్గింది. ఇప్పటి వరకు అంటే సుందరానికీ చిత్రం రూ. 18 నుండి 19 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ అందుకుంది. 

ఇక రూ. 30 కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం పది కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించిన అంటే సుందరానికీ వాళ్ళను థియేటర్స్ కి రప్పించలేకపోయింది. దీనికి ప్రధాన కారణం అధిక టికెట్స్ ధరలుగా తెలుస్తున్నాయి. నాని లాంటి టూ టైర్ హీరో సినిమా  200-300 రూపాయలు వెచ్చించి చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడటం లేదు. ఏది ఏమైనా నాని అంటే సుందరానికీ చిత్రం హిట్ టాక్ తెచ్చుకొని కూడా వసూళ్లు రాబట్టలేకపోయింది. 

కాగా అంటే సుందరానికీ చిత్ర డిజిటల్ హక్కులు నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. నేడు ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఆ సంస్థ ప్రకటించింది. జులై 8 నుండి అంటే సుందరానికీ  ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు నేడు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. మంచి కామెడీ, ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన అంటే సుందరానికీ ఓటీటీలో విజయం సాధించే అవకాశం కలదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూసే ఆస్కారం ఉంది. వివేక్ ఆత్రేయ అంటే సుందరానికీ చిత్రానికి దర్శకత్వం వహించగా... మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.  నజ్రియా హీరోయిన్ గా నటించారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?