రవితేజ ఖిలాడి నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్

Published : Apr 09, 2021, 09:35 AM IST
రవితేజ ఖిలాడి నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్

సారాంశం

మే 28న ఖిలాడి గ్రాండ్ గా విడుదల కానుంది. దీనితో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఈనెల 12న ఉదయం 10:08 నిమిషాలకు ఖిలాడి మూవీ టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. హీరో రవితేజ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన క్రాక్, ఆయనకు అవసరమైన విజయాన్ని అందించింది. దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ క్రాక్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. క్రాక్ మూవీ ఇచ్చిన విజయంతో ఊపుమీదున్న రవితేజ మరో ఎగ్సైటింగ్ అప్డేట్ తో ముందుకు వచ్చేశాడు. ఆయన లేటెస్ట్ మూవీ ఖిలాడి టీజర్ సిద్ధం చేశారు. 

మే 28న ఖిలాడి గ్రాండ్ గా విడుదల కానుంది. దీనితో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఈనెల 12న ఉదయం 10:08 నిమిషాలకు ఖిలాడి మూవీ టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హీరో రవితేజ తన ట్విట్టర్ ఖాతాలో ఈ అప్డేట్ పోస్ట్ చేయడం జరిగింది. దీనితో మాస్ మహరాజ్ రవితేజ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇస్తున్నట్లు అర్థం అవుతుంది. 

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఖిలాడి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇక రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన రమేష్ వర్మ ఖిలాడి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే కొన్ని యాక్షన్ సీన్స్ ఇటలీలో చిత్రీకరించారు. యాంకర్ అనసూయ ఈ మూవీలో ఓ రోల్ చేయడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు