హిట్ టాక్ అందుకున్న వకీల్ సాబ్

Published : Apr 09, 2021, 07:48 AM ISTUpdated : Apr 09, 2021, 07:50 AM IST
హిట్ టాక్ అందుకున్న వకీల్ సాబ్

సారాంశం

వకీల్ సాబ్ టాక్ బయటికి వచ్చేసింది. వకీల్ సాబ్ చిత్రం చూసిన ప్రేక్షకులు సూపర్ హిట్ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కమ్ బ్యాక్ అదిరిపోయిందని, వకీల్ సాబ్ మూవీ ఐ ఫీస్ట్ అని అంటున్నారు. లాయర్ గా పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూపించారట.

చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న వకీల్ సాబ్ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. గత వారం రోజులుగా పవన్ ఫ్యాన్స్ చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. బిగ్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ ని చూడాలని వారు ఎంతో ఆతృతగా ఉన్నారు. ఎట్టకేలకు వకీల్ సాబ్ మూవీ విడుదల అయ్యింది. అర్థ రాత్రి నుండే యూఎస్ ప్రీమియర్ షోస్ ప్రదర్శన జరగగా, నైజాంలో తెల్లవాఱుజామునుండి వకీల్ సాబ్ షోలు పడుతున్నాయి. 


దీనితో వకీల్ సాబ్ టాక్ బయటికి వచ్చేసింది. వకీల్ సాబ్ చిత్రం చూసిన ప్రేక్షకులు సూపర్ హిట్ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కమ్ బ్యాక్ అదిరిపోయిందని, వకీల్ సాబ్ మూవీ ఐ ఫీస్ట్ అని అంటున్నారు. లాయర్ గా పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూపించారట. సోషల్ సబ్జెక్టుకి కమర్షియల్ అంశాలు జోడించి దర్శకుడు వేణు శ్రీరామ్ గొప్పగా తెరకెక్కించాడన్న మాట వినిపిస్తుంది. 


థమన్ మ్యూజిక్ తో పాటు, కీలక రోల్స్ చేసిన అంజలి, నివేదా, అనన్యల నటన అద్భుతం అని తెలుస్తుంది. మొత్తంగా వకీల్ సాబ్ తో మరో బ్లాక్ బస్టర్ పవన్ తన ఖాతాలో వేసుకున్నాడు. హిందీ చిత్రం పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కగా,  దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?