
టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మేజర్ చిత్రాలన్నీ తమ విడుదల తేదీలు ప్రకటించేశాయి. మెగాస్టార్ చిరంజీవి నుండి శర్వానంద్ వరకు తమ లేటెస్ట్ చిత్రాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ ఇచ్చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం వకీల్ సాబ్ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు. ఇక ఈ లిస్ట్ లో మాస్ మహరాజ్ రవితేజ కూడా వచ్చి చేరారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడీ విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.
మే 28వ తేదీన ఖిలాడీ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఖిలాడీ మూవీ విడుదల తేదీ ప్రకటనతో రవితేజ ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు. ఈ సంక్రాంతి కి క్రాక్ రూపంలో ఫ్యాన్స్ దాహం తీర్చిన రవితేజ నాలుగు నెలల వ్యవధిలో మరో మాస్ ఎంటర్టైనర్ తో థియేటర్స్ లో సందడి చేయనున్నారు.
రాక్షసుడు ఫేమ్ దర్శకుడు రమేష్ వర్మ ఖిలాడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ఖిలాడీ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు. ఈ మేరకు నేడు చిత్ర యూనిట్ తెలియజేసింది. బహుశా అర్జున్ ఖిలాడీ మూవీలో ప్రతినాయకుడు రోల్ చేసే అవకాశం కలదని టాలీవుడ్ టాక్.