పవన్- క్రిష్ మూవీలో నిధి అగర్వాల్ అధికారికమే నట!

Published : Jan 30, 2021, 05:02 PM IST
పవన్- క్రిష్ మూవీలో నిధి అగర్వాల్ అధికారికమే నట!

సారాంశం

నిధి అగర్వాల్ క్రిష్-పవన్ మూవీలో నటిస్తుందంటూ వార్తలు వస్తున్నప్పటికీ స్పష్టత లేదు. అయితే కొద్దిరోజులుగా నిధి అగర్వాల్ ఈ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారట.  టూ టైర్ హీరోల సినిమాలలో నటిస్తున్న నిధి అగర్వాల్ ఏకంగా పవన్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం నిజంగా లక్కే అని చెప్పాలి.

ఎప్పుడూ లేని విధంగా పవన్ వరుస చిత్రాలు ప్రకటించడమే కాకుండా... ఏక కాలంలో రెండు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్... అయ్య్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ తో పాటు క్రిష్ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా  క్రిష్ మూవీలో హీరోయిన్ పై క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.  యంగ్  బ్యూటీ నిధి అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారట. నిధి అగర్వాల్ క్రిష్-పవన్ మూవీలో నటిస్తుందంటూ వార్తలు వస్తున్నప్పటికీ స్పష్టత లేదు. 

అయితే కొద్దిరోజులుగా నిధి అగర్వాల్ ఈ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారట.  టూ టైర్ హీరోల సినిమాలలో నటిస్తున్న నిధి అగర్వాల్ ఏకంగా పవన్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం నిజంగా లక్కే అని చెప్పాలి.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ విజయం సాధిస్తే నిధి రేంజ్ ఊహించడం కూడా కష్టమే. ఇక ఈ మూవీలో మరో హీరోయిన్ గా శ్రీలంక సుందరి జాక్విలిన్ పెర్నాండెజ్ ఎంపిక అయ్యాయరట. 

పవన్ మొదటిసారి నటిస్తున్న పీరియాడిక్ చిత్రంపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. క్రిష్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల చేయనున్నాడని సమాచారం అందుతుంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ ముందే షూటింగ్ మొదలు కాగా, 2021లో తిరిగి ప్రారంభమైంది. 2021 చివర్లో లేదా 2022 సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుందని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే