రామ్ చరణ్- ఉపాసన దంపతులకు అయోధ్య రాములోరి ఆహ్వానం...

Published : Jan 13, 2024, 04:08 PM IST
రామ్ చరణ్- ఉపాసన  దంపతులకు అయోధ్య రాములోరి ఆహ్వానం...

సారాంశం

ఈనెల 22న అయోధ్యలో ఎంతో ఘనంగా రాములోరి ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఈకార్యక్రమానికి దేశ వ్యాప్తంగాసెలబ్రిటీలందరికి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందుతున్నాయి.  

అయోధ్య లో జరగబోయే శ్రీరామ మందిర  ప్రతిష్ఠాపన కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరు హాజరవ్వబోతన్నారు. ఈకార్యక్రమానికి స్టార్ సెలబ్రిటీలకు ప్రత్యేకంగా ఆహ్వానాలు అందుతున్నాయి.  ఇప్పటికే  రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, సాధువులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆహ్వానాలను అందుకున్న సెలబ్రిటీలలో మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, అజయ్ దేవగణ్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, అలియా భట్, రణదీప్ హుడా, రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, ధనుష్ తదితరులు ఉన్నారు. 

ఇక తాజాగా  టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనలకు ఆహ్వానం అందింది. ఆరెస్సెస్ నేత సునీల్ అంబేద్కర్ హైదరాబాద్ లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ వేడుకకు రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 8 వేల మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. 

ఇక అయోధ్యలో ఈ నెల 22న మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో ఘనంగా.. వేల కోట్ల ఖర్చుకు పట్టి ఈ వేడుకను జరపబోతున్నారు.  లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రామాలయం కాంప్లెక్స్ ను 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఆలయంలోని ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తు ఉంటుంది. 44 ద్వారాలు, 392 పిల్లర్లతో ఆలయం నిర్మితమయింది.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌