చికెన్‌ బిర్యానీ తిని, అలా వెనక్కి వాలిపోయారు. నాన్న ప్రశాంతంగా వెళ్లిపోయారు: రవిబాబు

Published : Dec 25, 2022, 03:33 PM IST
చికెన్‌ బిర్యానీ తిని, అలా వెనక్కి వాలిపోయారు. నాన్న ప్రశాంతంగా వెళ్లిపోయారు: రవిబాబు

సారాంశం

చలపతిరావు మరణంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఈక్రమంలోనే ఆయన మరణం గురించి చలపతిరావు కుమారుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత రవిబాబు ఓ ప్రకటన చేశారు. చలపతిరావు మరణం ఎలా జరిగిందో వివరించారు.   

చలపతిరావు మరణంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఈక్రమంలోనే ఆయన మరణం గురించి చలపతిరావు కుమారుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత రవిబాబు ఓ ప్రకటన చేశారు. చలపతిరావు మరణం ఎలా జరిగిందో వివరించారు. 

చలపతిరావు హఠాత్మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. సడెన్ గా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు చలపతి. అయితే ఆయన మరణం చాలా ప్రశాంతంగా జరిగిందన్నారు చలపతిరావు కుమారుడు రవిబాబు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నాన్నను బాబాయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అందరితో సరదాగా  ఉంటూ జోక్స్‌ వేస్తూ మాట్లాడేవాడు. అందుకేనేమో సరదాగా ఎలాంటి నొప్పిలేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయారని  రవిబాబు అన్నారు. 

నాన్న నిన్న రాత్రి భోజనం చేసేవరకు బాగానే ఉన్నారు. చికెన్‌ బిర్యానీ, చికెన్‌ కూర తిని..ఆ ప్లేట్‌ అలా ఇచ్చి..వెనక్కి వాలిపోయారు. అప్పుడే ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇంత సింపుల్‌గా వెళ్లిపోయారాయన. ఇండస్ట్రీలో ఎంతో మందికి మంచి చేశారు.. ఆ విషయం నాకు ఇండస్ట్రీకి వచ్చిన తరువాత తెలిసింది. అందుకే ఆయనకు అంత ప్రశాంతయరణం లభించిందన్నారు రవిబాబు.  ఈ రోజు అంత్యక్రియలు చేద్దామనుకున్నాం. కానీ మా సిస్టర్స్ ఇద్దరూ అమెరికా లో ఉన్నారు. వాళ్ళు మంగళవారం రాత్రి కి వస్తారు. మంగళవారం వరకు మహా ప్రస్థానం లో ఫ్రీజర్ లో ఉంచుతాం. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తాం అని రవిబాబు అన్నారు. 


ఇండస్ట్రీలో తన తండ్రి ఎంతో మందికి సాయం చేశారని, ఆ విషయం  తమ ఫ్యామిలీలో ఎవరికీ తెలియదన్నారు. కాని తను ఇండస్ట్రీకి వచ్చిన తరువాత తన తండ్రి గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నా అన్నారు.ఆయన ఎలాంటివారో  అప్పుడు తనకు పూర్తిగా అర్థం అయ్యిందన్నారు. మా నాన్న గురించి నాకంటే మీ అందరికే ఎక్కువ తెలుసు. ఆయన ఎలాంటి వ్యక్తి, ఇండస్ట్రీలో ఎలా ఉంటారనే విషయం చిన్నప్పుడు నాకు తెలియదు అన్నారు. 

నాన్నకు  రామారావు గారు, ఆహారం, హాస్యం ఈ మూడే చాలా ఇష్టం. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. అలానే ఇప్పుడు ఒక్క క్షణంలో ఎలాంటి బాధ లేకుండా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. అలాంటి వ్యక్తికి శత్రువులు ఎవ్వరూ ఉండరు. నా కొత్త సినిమాలో ఆయన చివరగా నటించారు. ఐదు రోజుల క్రితమే షూటింగ్ లో పాల్గొన్నారు. అదే ఆయనకు చివరి సినిమా అని అన్నారు  రవిబాబు.

ఇక తన తండ్రికి ఎన్టీఆర్‌, మంచి భోజనం, హాస్యం  అంటే చాలా ఇష్టమని, ఎంతో అభిమానించే ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం తన తండ్రికి దక్కిందని రవిబాబు అన్నారు. తన జీవితంలో పెద్దాయనతో ఎక్కువ కాలం ట్రావెల్ చేశారన్నారు రవిబాబు. అనారోగ్యంతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న సీనియర్‌ నటుడు చలపతిరావు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుమారుడు రవిబాబు మీడియాకు తెలియజేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌
Karthika Deepam 2 Latest Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- సీరియస్ అయిన శివన్నారాయణ, సుమిత్ర