ఓటీటీలో రవిబాబు `రష్‌.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

Published : Jun 21, 2024, 05:54 PM IST
ఓటీటీలో రవిబాబు `రష్‌.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

సారాంశం

నటుడు, దర్శకుడు, నిర్మాత, ఎడిటర్‌ రవిబాబు.. తాజాగా `రష్‌` సినిమాతో వచ్చారు. థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో విడుదలైంది. దీనికి ఎలాంటి స్పందన ఉందంటే..  

విలక్షణ దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నారు రవిబాబు. ఆయన నటుడిగానే నిర్మాతగా, దర్శకుడిగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడిగా తనలోని క్రియేటివిటీని చూపిస్తున్నారు. చాలా సెలక్టీవ్‌గా ఆయన సినిమాలు చేస్తున్నారు. `నచ్చావులే` చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్నారు. ఆద్యంతం నవ్వించడంతోపాటు ఎమోషనల్‌గా గుండె బరువెక్కించారు ఆ తర్వాత `అవును, `అవును 2` చిత్రాలో  భయటపెట్టాడు. మరోవైపు `అనసూయ`, `అమరావతి` చిత్రాలతో థ్రిల్లర్‌ యాక్షన్‌ చూపించి మెప్పించాడు. హర్రర్‌ సినిమాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. తెలుగులో హర్రర్ మూవీస్‌ స్పెషలిస్ట్ గా మారారు. 

వైవిధ్యమైన సినిమాలో మెప్పిస్తున్నారు ఆయన. చాలా గ్యాప్‌ తీసుకుని సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన `రష్‌` అనే మూవీతో వచ్చారు. రవిబాబు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తూ, కథ - స్క్రీన్ ప్లే అందించిన‌ చిత్రమిది. సతీశ్ పోలోజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డైసీ బోపన్న ప్రధాన పాత్ర పోషించారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో, యూనిక్ పాయింట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్`లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా దీనికి మంచి స్పందన లభిస్తుంది. థ్రిల్లర్‌ సినిమాలకు ఓ కొత్త అనుభూతినిస్తుంది. ఇటీవల కాలంలో వచ్చిన చిత్రాలతో ఇదొక భిన్నమైన మూవీగా నిలిచి మెప్పిస్తుంది. కథ, కథనాలు ఎంగేజింగ్‌గా సాగడంతో దీనికి విశేష ఆదరణ లభిస్తుంది.

`రష్‌` గురించి చూస్తే, ఒక సాధార‌ణ గృహిణికి కొన్ని అసాధార‌ణ ప‌రిస్థితులు ఎదురైతే వాటిని ఆమె ధైర్యంగా ఎలా ఎదుర్కొంది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో అద్భుత‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ర‌విబాబు డిస్క‌స్ చేసిన సోష‌ల్ ఇష్యూ కూడా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క  ఆలోచింప‌జేస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం ఈటీవి విన్‌లో మంచి ప్రేక్ష‌కాధ‌ర‌ణ‌తో దూసుకుపోతుంది. ఇటీవ‌లి కాలంలో ప‌ర్‌ఫెక్ట్ కంటెంట్ తో వచ్చిన సినిమాల జాబితాలో ఈ సినిమా చేర‌డంతో పాటు యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ర‌ష్ త‌ప్ప‌క ఒక మంచి ఛాయిస్‌ గా నిలుస్తుందని టీమ్‌ చెబుతుంది. చూసిన వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ డిజప్పాయింట్ కారని అంటున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్